New MNP rules: పోర్టింగ్‌కు కొత్త రూల్‌.. సిమ్‌ మార్చాక 7 రోజులు ఆగాల్సిందే..!

New MNP rules: మొబైల్‌ నంబర్ పోర్టింగ్‌కు కేంద్రం కొత్త రూల్‌ తీసుకొచ్చింది. జులై 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.

Published : 29 Jun 2024 13:21 IST

New MNP rules| దిల్లీ: సిమ్‌ స్వాప్‌ లేదా మార్పిడి తర్వాత మొబైల్‌ నంబర్‌ పోర్టింగ్‌కు (MNP) అర్హత పొందేందుకు ఏడు రోజుల నిరీక్షణ సమయం ఉంటుందని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) వెల్లడించింది. ఈ కొత్త నిబంధన జులై 1 నుంచి అమల్లోకి రానుంది. మొబైల్‌ ఫోన్‌ నంబర్ల వినియోగించి జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ట్రాయ్‌ ఈ చర్యలు చేపట్టింది.

ఇంతకు ముందు సిమ్‌ స్వాప్‌ చేసిన సందర్భంలో నిరీక్షణ సమయం 10 రోజులుగా ఉండగా.. తాజా సవరణలో దాన్ని ఏడు రోజులకు తగ్గించింది. దీంతో ఇకపై ఏడు రోజుల్లోగా నంబరు మార్చుకునేందుకు యూనిక్‌ పోర్టింగ్‌ కోడ్‌ (UPC)ను కేటాయించారు. సిమ్‌ స్వాప్‌ తర్వాత 10 రోజుల నిరీక్షణ సమయం ఎక్కువని పలు సంస్థలు అభిప్రాయపడగా, 10 రోజుల నిరీక్షణ సమయం వల్ల చందాదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు మరికొన్ని సంస్థలు వెల్లడించాయి. 2-4 రోజుల సమయం సరిపోతుందని తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని