దేశంలో పేదరికం తగ్గింది!

దేశంలో పేదరికం తగ్గిందని ఆర్థిక మేధో సంస్థ ఎన్‌సీఏఈఆర్‌ విడుదల చేసిన అధ్యయన పత్రంలో వెల్లడించింది. 2011-12లో దేశంలో 21.2% పేదరికం ఉండగా, 2022-24 మధ్య 8.5 శాతానికి పరిమితమైందని పేర్కొంది.

Published : 04 Jul 2024 02:46 IST

2011-12లో 21.2% కాగా 2022-24లో 8.5 శాతమే
ఆర్థిక మేధో సంస్థ ఎన్‌సీఏఈఆర్‌

దిల్లీ: దేశంలో పేదరికం తగ్గిందని ఆర్థిక మేధో సంస్థ ఎన్‌సీఏఈఆర్‌ విడుదల చేసిన అధ్యయన పత్రంలో వెల్లడించింది. 2011-12లో దేశంలో 21.2% పేదరికం ఉండగా, 2022-24 మధ్య 8.5 శాతానికి పరిమితమైందని పేర్కొంది. కొవిడ్‌ వంటి ఊహించని పరిణామాలు ఎదురైనా, ఆ సవాళ్లను తట్టుకుని దేశం ప్రగతి పథంలో ముందుకెళుతోందని తెలిపింది. ‘రీ థింకింగ్‌ సోషల్‌ సేఫ్టీ నెట్స్‌ ఇన్‌ ఎ ఛేంజింగ్‌ సొసైటీ’ పేరుతో ఎన్‌సీఏఈఆర్‌ ఈ పత్రాన్ని విడుదల చేసింది. సోనాల్డే దేశాయ్‌ ఈ పత్రాన్ని రూపొందించారు. ఇండియా హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ సర్వే (ఐహెచ్‌డీఎస్‌) ఇటీవల పూర్తి చేసిన వేవ్‌ 3తో పాటు గతంలోని వేవ్‌ 1, 2 డేటాను ఈ పత్రం రూపొందించేందుకు వినియోగించుకున్నారు.

  • ఐహెచ్‌డీఎస్‌ గుర్తించిన దాని ప్రకారం, 2004-05లో దేశంలో పేదరికం 38.6 శాతంగా ఉండగా, 2011-12 నాటికి 21.2 శాతానికి తగ్గింది. ఒకవైపు కొవిడ్‌ సవాళ్లు ఎదురైనా 2011-12 నుంచి 2022-24 నాటికి 8.5 శాతానికి పరిమితమైంది.
  • ఈ ఏడాది ప్రారంభంలో నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రమణ్యమ్‌ కూడా వినియోగదారు వ్యయ సర్వే ప్రకారం, దేశంలో పేదరికం 5 శాతం వరకు తగ్గి ఉంటుందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు సుభిక్షంగా మారుతున్నారని పేర్కొన్న సంగతి తెలిసిందే.
  • నేషనల్‌ శాంపుల్‌ సర్వే ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) ప్రకారం, కుటుంబ వినియోగ వ్యయం 2011-12తో పోలిస్తే 2022-23లో రెట్టింపునకు పైగా పెరిగింది.
  • తెందూల్కర్‌ కమిటీ నివేదిక ప్రకారం, దారిద్య్ర రేఖ అనేది గ్రామీణ ప్రాంతాల్లో రూ.447గా, పట్టణ ప్రాంతాల్లో రూ.579గా నిర్ణయించారు. 2004-05 మధ్య దీన్ని రాష్ట్రాల వారీగా మార్చారు. 2011-12 నాటికి ప్రణాళికా సంఘం వీటిని రూ.860, రూ.1,000కి సర్దుబాటు చేసింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని