అదనపు బ్యాగేజీ రవాణాకు సహకారం: అవాన్‌

విమానాల్లో పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లాలంటే, అధిక ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇంత భరించలేక కొన్ని వస్తువులను విమానాశ్రయాల్లో ప్రయాణికులు వదిలేస్తుంటారు.

Updated : 03 Jul 2024 02:36 IST

హైదరాబాద్‌ (మాదాపూర్‌), న్యూస్‌టుడే: విమానాల్లో పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లాలంటే, అధిక ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇంత భరించలేక కొన్ని వస్తువులను విమానాశ్రయాల్లో ప్రయాణికులు వదిలేస్తుంటారు. విమానయాన సంస్థల కంటే తక్కువ ధరకే తాము ఆయా వస్తువులను గమ్యస్థానాలకు చేరుస్తామని అవాన్‌ సంస్థ తెలిపింది. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇందుకోసం తమ కేంద్రాన్ని ప్రారంభించినట్లు అవాన్‌ సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈఓ మీరాసింగ్‌ తెలిపారు. ఎయిర్‌లైన్‌ సంస్థలు అదనపు బ్యాగేజీ కోసం దేశీయంగా కిలోకు రూ.500 వసూలు చేస్తున్నాయని, తమ సంస్థ కిలోకు రూ.89కే రవాణా చేస్తుందని మంగళవారం ఇక్కడ వివరించారు. ప్రయాణికులు 10-30 కిలోల అదనపు లగేజీని దిల్లీ, జయపూర్, అహ్మదాబాద్, హైదరాబాద్‌ విమానాశ్రయాల్లోని అవాన్‌ కౌంటర్‌ వద్ద అప్పగిస్తే తక్కువ ధరకే, నిర్దేశించిన సమయంలో భద్రంగా వారి ఇంటికి చేర్చుతామని వివరించారు. ఈ ఏడాది చివరికి దేశవ్యాప్తంగా 50 ప్రధాన నగరాల్లో తమ సేవలు విస్తరించే లక్ష్యంతో ఉన్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని