విద్యార్థుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫారెక్స్‌ కార్డ్‌

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఒక ప్రీ పెయిడ్‌ ‘సఫైరో ఫారెక్స్‌ కార్డ్‌’ను ఐసీఐసీఐ బ్యాంక్‌ మంగళవారం ఆవిష్కరించింది.

Updated : 03 Jul 2024 02:35 IST

దిల్లీ: ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఒక ప్రీ పెయిడ్‌ ‘సఫైరో ఫారెక్స్‌ కార్డ్‌’ను ఐసీఐసీఐ బ్యాంక్‌ మంగళవారం ఆవిష్కరించింది. విద్యార్థులకు ప్రత్యేక ప్రయోజనాలు, సౌలభ్యాన్ని అందించడం కోసం ఈ కార్డును తీసుకొచ్చింది. అడ్మిషన్‌ ఫీజు, కోర్సు ఫీజులతో పాటు రోజువారీ వ్యయాలైన ప్రయాణ, భోజన, నిత్యావసరాల ఖర్చులను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సులువుగా నిర్వహించుకునేందుకు ఇది వీలు కల్పిస్తుందని బ్యాంకు పేర్కొంది. ఎటువంటి క్రాస్‌ కరెన్సీ మార్క్‌ అప్‌ ఛార్జీ లేకుండా, దాదాపు 15 కరెన్సీలను జమ చేయడంతో పాటు లావాదేవీలనూ నిర్వహించుకోవచ్చు. ఒకే కరెన్సీని కార్డులో లోడ్‌ చేసినా, ప్రపంచమంతా విద్యార్థులు సులువుగా ప్రయాణించొచ్చని తెలిపింది. రూ.15,000 వరకు ప్రయోజనాలు, ప్రత్యేక సౌలభ్యాలతో కార్డును తీసుకోవచ్చని తెలిపింది. ఐమొబైల్‌ పే/ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఎపుడైనా, ఎక్కడి నుంచైనా విద్యార్థులు/తల్లిదండ్రులు ఈ కార్డులో డబ్బులు జమ చేయొచ్చని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని