రూ.2,000 నోట్లు 97.87% వెనక్కి వచ్చాయ్‌: ఆర్‌బీఐ

రూ.2,000 నోట్లలో 97.87% వరకు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సోమవారం వెల్లడించింది. రూ.7,581 కోట్ల విలువైన నోట్లు మాత్రం ఇంకా ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది.

Published : 02 Jul 2024 01:41 IST

ముంబయి: రూ.2,000 నోట్లలో 97.87% వరకు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సోమవారం వెల్లడించింది. రూ.7,581 కోట్ల విలువైన నోట్లు మాత్రం ఇంకా ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది. 2023 మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వ్యవస్థలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. 2024 జూన్‌ 28 నాటికి రూ.7,581 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయి. పోస్టాఫీసుల నుంచి రూ.2,000 నోట్లను దేశంలోని ఏదైనా ఆర్‌బీఐ ఇష్యూ కార్యాలయాలకు పంపిస్తే, ఆ మొత్తాన్ని వారి బ్యాంక్‌ ఖాతాల్లో క్రెడిట్‌ చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, బేలాపుర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, గువహటి, జైపుర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, నాగ్‌పుర్, న్యూదిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని 19 ఆర్‌బీఐ కార్యాలయాలు రూ.2,000 నోట్ల డిపాజిట్‌/మార్పిడి చేస్తున్నాయి. 2016 నవంబరులో రూ.2,000 నోట్లను పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని