ఆర్‌బీఐకి ఇద్దరు కొత్త ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌లుగా అర్నబ్‌ కుమార్‌ ఛౌధ్రీ, చారులతా ఎస్‌ కర్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు వీరు ఆర్‌బీఐలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్లుగా ఉన్నారు.

Published : 02 Jul 2024 01:40 IST

ముంబయి: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌లుగా అర్నబ్‌ కుమార్‌ ఛౌధ్రీ, చారులతా ఎస్‌ కర్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు వీరు ఆర్‌బీఐలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్లుగా ఉన్నారు. వీరిద్దరు చెరో మూడు విభాగాలను పర్యవేక్షించనున్నారు. కర్‌ నియామకం జులై 1 నుంచి, ఛౌధ్రీ నియామకం జులై 3 నుంచి అమల్లోకి వస్తున్నాయి. డీఐసీజీసీ, విదేశీ మారకపు విభాగం, అంతర్జాతీయ విభాగాలను ఛౌధ్రీ చూస్తారు. కమ్యూనికేషన్, మానవ వనరులు, సమాచార హక్కు విభాగాలను కర్‌ నడిపించనున్నారు. 

  • ఓఎన్‌జీసీ నుంచి గణనీయ ఆర్డరు దక్కించుకున్నట్లు ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. కంపెనీ రూ.1000- 2500 కోట్ల శ్రేణిలో వాటిని గణనీయ ఆర్డర్లుగా పరిగణిస్తుంది.
  • కేరళకు చెందిన బేబీ మెమోరియల్‌ హాస్పిటల్‌ (బీఎంహెచ్‌)లో నియంత్రిత వాటాను కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్‌ ప్రకటించింది. హాస్పిటల్‌లో 70% వాటాను దాదాపు రూ.2000 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్యాలికట్, కన్నూర్‌లలో మొత్తం 1000 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను బీఎంహెచ్‌ నిర్వహిస్తోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని