ఎయిరిండియా పైలట్ల శిక్షణ సంస్థ

టాటా గ్రూప్‌ యాజమాన్యంలోని ఎయిరిండియా, మహారాష్ట్రలోని అమరావతిలో పైలట్ల శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ ఏడాదికి 180 మంది వాణిజ్య పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది ప్రతిపాదన.

Published : 02 Jul 2024 01:39 IST

ముంబయి: టాటా గ్రూప్‌ యాజమాన్యంలోని ఎయిరిండియా, మహారాష్ట్రలోని అమరావతిలో పైలట్ల శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ ఏడాదికి 180 మంది వాణిజ్య పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది ప్రతిపాదన. పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) లైసెన్స్‌తో, ఫ్లైట్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌టీఓ)ను బెలోరా ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఎయిరిండియా ఏర్పాటు చేస్తోంది. ఇది దక్షిణాసియాలోనే అతి పెద్దది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఎయిరిండియా తెలిపింది. ఇక్కడ శిక్షణ కోసం 31 సింగిల్‌-ఇంజిన్‌ విమానాలు, 3 ట్విన్‌-ఇంజిన్‌ విమానాలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. పది ఎకరాల ప్రాంగణంలో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని