ఐపీఓలకు కంపెనీలు సై

తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ శివాలిక్‌ ఇంజినీరింగ్‌ ఇండస్ట్రీస్‌ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది.

Published : 02 Jul 2024 01:34 IST
  • తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ శివాలిక్‌ ఇంజినీరింగ్‌ ఇండస్ట్రీస్‌ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. 
  • ఆన్‌లైన్‌ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫస్ట్‌క్రై మాతృసంస్థ బ్రెయిన్‌బీస్‌ సొల్యూషన్స్‌ ఐపీఓకు సెబీ అనుమతి ఇచ్చింది. మరో మూడు కంపెనీలు సాస్‌ ప్లాట్‌ఫామ్‌ యూనికామర్స్‌ ఇసొల్యూషన్స్, గాలా ప్రెసిషన్‌ ఇంజినీరింగ్, ఇంటర్‌ఆర్క్‌ బిల్డింగ్‌ ప్రోడక్ట్స్‌ ఐపీఓ ప్రతిపాదనలకూ సెబీ పచ్చజెండా ఊపింది.
  • ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు అనుమతి కోరుతూ, ఆరోగ్య సేవల రంగంలో టెక్నాలజీ ఆధారిత సేవలు అందించే సాగిలిటీ ఇండియా ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. 
  • మురుగునీటి శుద్ధి ప్లాంట్లను అభివృద్ధి చేసే ఎన్విరో ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ఐపీఓకు రానుంది. ఇందు కోసం సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఇష్యూలో భాగంగా 4.42 కోట్ల తాజా షేర్లతో పాటు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 52.68 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయిస్తారు.
  • ఐపీఓ ద్వారా రూ.3000 కోట్లు సమీకరించేందుకు నివా బుపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (ఇంతకు ముందు మ్యాక్స్‌ బుపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌) సెబీ వద్ద ప్రాథమిక పత్రాలు దాఖలు చేసింది. ఐపీఓలో భాగంగా రూ.800 కోట్ల విలువైన తాజా షేర్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో రూ.2200 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు.
  • అగ్రోకెమికల్‌ తయారీ సంస్థ అంబే లేబొరేటరీస్‌ ఐపీఓ జులై 4న ప్రారంభమై 8న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.65-68 నిర్ణయించారు. ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ ఎమర్జ్‌పై ఈ కంపెనీ షేర్లు నమోదుకానున్నాయి. రిటైల్‌ మదుపర్లు కనీసం 2000 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని