పత్తి సానుకూలమే!

పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,044 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది.

Published : 01 Jul 2024 03:13 IST

కమొడిటీస్‌
ఈ వారం

పసిడి

సిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,044 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,504; రూ.73,091 వరకు రాణించవచ్చు. ఒకవేళ రూ.70,997 కంటే దిగువన ట్రేడయితే రూ.70,410; రూ.69,950 వరకు దిగి వచ్చే అవకాశం ఉంటుంది. రూ.70,751 దిగువన లాంగ్‌ పొజిషన్లకు దూరంగా ఉండటం మేలు. 


వెండి 

వెండి సెప్టెంబరు కాంట్రాక్టుకు రూ.88,032 వద్ద మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయిని కోల్పోతే రూ.86,504; రూ.84,770 వరకు దిగిరావచ్చు. ఒకవేళ పైకి వెళితే రూ.91,294 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని మించితే రూ.93,028; రూ.94,556 వరకు రాణించే అవకాశం ఉంటుంది. 


ప్రాథమిక లోహాలు

  • రాగి జులై కాంట్రాక్టు రూ.825.65 కంటే దిగువన చలించకుంటే, కొంత మేర సానుకూల ధోరణిలో కదలాడేందుకు అవకాశం ఉంటుంది. 
  • సీసం జులై కాంట్రాక్టు రూ.187.75 కంటే దిగువన కదలాడితే, రూ.185.85;     రూ.184.75 వరకు దిద్దుబాటు కావచ్చు. అదేవిధంగా రూ.190.65 కంటే పైన చలిస్తే   రూ.191.75; రూ.193.65 వరకు రాణించే అవకాశం ఉంటుంది. 
  • జింక్‌ జులై కాంట్రాక్టు రూ.257.75 కంటే దిగువన చలించకుంటే.. లాంగ్‌ పొజిషన్ల వైపు మొగ్గు చూపడం మంచి వ్యూహమే అవుతుంది. రూ.268; ఆ తర్వాత రూ.273 వరకు పెరిగే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. 
  • అల్యూమినియం జులై కాంట్రాక్టు సానుకూలంగా కనిపిస్తున్నప్పటికీ.. రూ.232.30 వద్ద నిరోధం కనిపిస్తోంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.234.20; రూ.236.55 వరకు పెరుగుతుందని భావించొచ్చు. ఒకవేళ రూ.228.05 కంటే కిందకు వస్తే రూ.225.70; రూ.223.80 వరకు పడిపోవచ్చు. 

ఇంధన రంగం

  • ముడి చమురు జులై కాంట్రాక్టు రూ.6,703 కంటే దిగువన చలిస్తే రూ.6,602; రూ.6,504 వరకు దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ రూ.6,703 దిగువకు రాకుంటే, సానుకూలంగా చలించి రూ.6,936 వరకు పెరగొచ్చు.  
  • సహజవాయువు జులై కాంట్రాక్టును రూ.220 దిగువన మాత్రమే షార్ట్‌ సెల్‌ చేయాలి. రూ.210 వద్ద కొంత మద్దతు లభించొచ్చు. రూ.232.30 కంటే ఎగువన కదలాడితే మాత్రం రూ.247.10; రూ.254.60 వరకు కాంట్రాక్టు రాణించే అవకాశం ఉంటుంది. 

వ్యవసాయ ఉత్పత్తులు

  • పసుపు ఆగస్టు కాంట్రాక్టుకు రూ.16,558 వద్ద మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయిని కోల్పోతే రూ.16,193; రూ.15,584 వరకు దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ సానుకూల ధోరణిలో చలిస్తే రూ.17,532 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే రూ.18,141; రూ.18,506 వరకు పెరుగుతుందని భావించొచ్చు. 
  • పత్తి క్యాండీ జులై కాంట్రాక్టు సానుకూలంగానే కనిపిస్తోంది. ధర తగ్గినప్పుడల్లా కొత్తగా లాంగ్‌ పొజిషన్లు జతచేసుకోవడం మంచిదే. అయితే రూ.59,700 వద్ద నిరోధం ఎదురుకావచ్చనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఒకవేళ కిందకు వస్తే రూ.57,850 వద్ద మద్దతు లభించొచ్చు. 

ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని