లిక్విడేషన్‌ ప్రక్రియ పర్యవేక్షణకు ఎలక్ట్రానిక్‌ ఫామ్‌లు: ఐబీబీఐ

దివాలా పరిష్కార వృత్తి నిపుణులకు నిబంధనల భారం సులభతరం చేసేందుకు, లిక్విడేషన్‌ ప్రక్రియను ప్రభావవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా దివాలా స్మృతి (ఐబీసీ) కింద ఎలక్ట్రానిక్‌ ఫామ్‌లను ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీబీఐ) తీసుకొచ్చింది.

Published : 01 Jul 2024 03:08 IST

దిల్లీ: దివాలా పరిష్కార వృత్తి నిపుణులకు నిబంధనల భారం సులభతరం చేసేందుకు, లిక్విడేషన్‌ ప్రక్రియను ప్రభావవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా దివాలా స్మృతి (ఐబీసీ) కింద ఎలక్ట్రానిక్‌ ఫామ్‌లను ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీబీఐ) తీసుకొచ్చింది. లిక్విడేషన్‌ ప్రక్రియలో ఈ ఫామ్‌లు ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయని, రికార్డులను పద్ధతిగా, పారదర్శకంగా నిర్వహించేందుకు, ఆటంకాలు లేని రిపోర్టింగ్‌కు ఇవి దోహదం చేస్తాయని ఐబీబీఐ వెల్లడించింది. జూన్‌ 28న తీసుకొచ్చిన కొత్త సర్క్యులర్‌లో ఎల్‌ఐక్యూ 1 నుంచి ఎల్‌ఐక్యూ 4 వరకు ఫామ్‌లను పరిచయం చేస్తున్నట్లు ఐబీబీఐ తెలిపింది. లిక్విడేషన్‌ ప్రక్రియలో వివిధ దశల్లో ఆయా ఎలక్ట్రానిక్‌ ఫామ్‌లను వినియోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దివాలా పరిష్కార వృత్తి నిపుణులు (ఐపీలు) లిక్విడేషన్‌ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఇ-మెయిళ్ల ద్వారా బోర్డుకు తెలియజేస్తున్నారు. దీంతో సమయం వృథా అవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని