హెచ్‌సీజీ చేతికి మహాత్మా గాంధీ క్యాన్సర్‌ హాస్పిటల్‌?

విశాఖపట్నంలోని మహాత్మా గాంధీ క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను దేశంలోని అతిపెద్ద క్యాన్సర్‌ వైద్య సేవల సంస్థ అయిన హెచ్‌సీజీ సొంతం చేసుకోనుందని తెలుస్తోంది.

Published : 30 Jun 2024 03:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: విశాఖపట్నంలోని మహాత్మా గాంధీ క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను దేశంలోని అతిపెద్ద క్యాన్సర్‌ వైద్య సేవల సంస్థ అయిన హెచ్‌సీజీ సొంతం చేసుకోనుందని తెలుస్తోంది. రూ.414 కోట్ల విలువకు మహాత్మా గాంధీ క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఈ సంస్థ కొనుగోలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలి దశలో  రూ.208 కోట్లు చెల్లించి 51 శాతం వాటాను హెచ్‌సీజీ కొనుగోలు చేస్తుంది. మిగిలిన వాటాను తర్వాత దశల వారీగా సొంతం చేసుకునే అవకాశం ఉంది. తన చేతికి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పడకల సంఖ్యను పెంచడంతో పాటు వైద్య సేవలను విస్తరించాలని హెచ్‌సీజీ భావిస్తోంది. విశాఖపట్నంలో క్యాన్సర్‌ వైద్య సేవలకు ఇటీవల కాలంలో గిరాకీ బాగా పెరుగుతోంది. ఈ అంశాన్ని హెచ్‌సీజీ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హెచ్‌సీజీ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థ మనదేశంతో పాటు ఆఫ్రికా దేశాల్లో 21 క్యాన్సర్‌ ఆస్పత్రులను నిర్వహిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని