రూ.12,000 కోట్ల సమీకరణలో ఎన్‌టీపీసీ

ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీ.. మార్పిడి రహిత డిబెంచర్ల (ఎన్‌సీడీ) జారీ ద్వారా రూ.12,000 కోట్లను సమీకరించనుంది.

Published : 30 Jun 2024 03:07 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీ.. మార్పిడి రహిత డిబెంచర్ల (ఎన్‌సీడీ) జారీ ద్వారా రూ.12,000 కోట్లను సమీకరించనుంది. ఇందుకు శనివారం ఆ సంస్థ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనకు వాటాదార్ల అనుమతిని తీసుకోవాల్సి ఉంది. ‘దేశీయ విపణిలో ఒకటి లేదా 12 వరకు విడతల్లో సెక్యూర్డ్‌/అన్‌సెక్యూర్డ్, రెడీమబుల్, పన్నుతో కూడిన/పన్ను రహిత, క్యుములేటివ్‌/నాన్‌ క్యుములేటివ్‌ ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.12,000 కోట్లను సమీకరించే ప్రతిపాదనకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనపై ప్రత్యేక తీర్మానానికి ఆమోదం లభించిన రోజు నుంచి ఏడాది కాలంలోగా లేదంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో జరిగే తదుపరి వార్షిక సాధారణ సమావేశం తేదీ వరకు ఏదీ ముందైతే అప్పటిలోగా ఈ బాండ్ల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆ ప్రతిపాదనలో పొందుపర్చినట్లు’ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఎన్‌టీపీసీ తెలిపింది. ఇష్యూ పరిమాణం, కాలపరిమితి, నమోదు వివరాలు (బీఎస్‌ఈ లేదా ఎన్‌ఎస్‌ఈ లేదా రెండింటిలో), కూపన్, సెక్యూరిటీ, ఇతరత్రా వివరాలను ప్రతి ఒక్క విడత ప్రారంభంలో నిర్ణయిస్తామని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని