కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ నుంచి సరికొత్త కాంప్లెక్స్‌ ఎరువు

‘పరమ్‌ఫోస్‌ ప్లస్‌’ అనే పేరుతో మెగ్నీషియంతో కూడిన కాంప్లెక్స్‌ ఎరువును కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ విడుదల చేసింది.

Published : 29 Jun 2024 02:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘పరమ్‌ఫోస్‌ ప్లస్‌’ అనే పేరుతో మెగ్నీషియంతో కూడిన కాంప్లెక్స్‌ ఎరువును కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ విడుదల చేసింది. ఇందులో 16% నత్రజని, 20 శాతం భాస్వరం, 12% సల్ఫర్‌కు తోడు అదనంగా 0.6% మెగ్నీషియం ఉంటాయి. మెగ్నీషియంను జోడించటం వల్ల కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి పత్రహరితం అధికంగా ఉత్పత్తి అవుతుంది. తద్వారా మొక్కలు నాణ్యంగా, త్వరగా పెరుగుతాయి. ఉత్పత్తి కూడా అధికంగా ఉంటుంది. వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు, రాగి, వేరుశెనగ పంటలతో పాటు కూరగాయల పెంపకంలో ఈ ఎరువును వినియోగించవచ్చని కంపెనీ వెల్లడించింది. రైతులకు మేలు చేసే ఉద్దేశంతో ఈ వినూత్న ఎరువును ఆవిష్కరించినట్లు కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌.శంకర సుబ్రమణియన్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని