మేలో కీలక రంగాల వృద్ధి 6.3%

మేలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తిలో 6.3 శాతం మేర వృద్ధి నమోదైంది. విద్యుత్, బొగ్గు, సహజవాయువు రంగాలు రాణించడం ఇందుకు ఉపకరించింది.

Published : 29 Jun 2024 02:58 IST

దిల్లీ: మేలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తిలో 6.3 శాతం మేర వృద్ధి నమోదైంది. విద్యుత్, బొగ్గు, సహజవాయువు రంగాలు రాణించడం ఇందుకు ఉపకరించింది. ఏప్రిల్‌లో ఈ 8 కీలక రంగాల ఉత్పత్తి 6.7 శాతం మేర పెరిగింది. ఈ ప్రకారంగా చూస్తే.. ఏప్రిల్‌తో పోలిస్తే మేలో కీలక రంగాల వృద్ధి రేటు నెమ్మదించడం గమనార్హం. బొగ్గు, ముడి చమురు, సహజవాయువు, శుద్ధి ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్‌ను కీలక రంగాలుగా వ్యవహరిస్తారు. కిందటేడాది మేలో ఈ రంగాల ఉత్పత్తిలో 5.2 శాతం వృద్ధి ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం.. ఎరువులు, ముడి చమురు, సిమెంట్‌ ఉత్పత్తిలో ప్రతికూల వృద్ధి నమోదైంది. మరోవైపు మేలో బొగ్గు, సహజవాయువు, విద్యుత్‌ రంగాల ఉత్పత్తిలో వృద్ధి వరుసగా 10.2%; 7.5%, 12.8 శాతం మేర ఉంది. కిందటేడాది ఇదే నెలలో ఈ రంగాల ఉత్పత్తిలో వృద్ధి వరుసగా 7.2%; -0.3%, 0.8 శాతంగా నమోదైంది. శుద్ధి ఉత్పత్తులు, ఉక్కు రంగాల ఉత్పత్తిలో వృద్ధి రేటు 0.5%, 7.6 శాతానికి తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని