ఎంఎస్‌ఎంఈ సంస్థలకు యాక్సిస్‌ బ్యాంకు ప్రత్యేక సదుపాయాలు

అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్సిస్‌ బ్యాంకు పలు ఆఫర్లు ప్రకటించింది.

Published : 29 Jun 2024 02:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్సిస్‌ బ్యాంకు పలు ఆఫర్లు ప్రకటించింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) తమ వ్యయాలను తగ్గించుకునేందుకు, సులువుగా నిధులు పొందేందుకు, బ్యాంకింగ్‌ లావాదేవీలను వేగంగా నిర్వహించేందుకు ఈ ఆఫర్లు వీలుకల్పిస్తాయి. అంతేగాకుండా  ఎంఎస్‌ఎంఈ వినియోగదార్లకు ప్రాసెసింగ్‌ ఫీజులో 50 శాతం రాయితీపై సెక్యూర్డ్‌ వర్కింగ్‌ క్యాపిటల్, ఈఎంఐ ఆధారిత సెక్యూరిటీ లేని రుణాలు మంజూరు చేసే సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్‌ఎంఈ సంస్థలు ఎంతో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు, అందువల్ల ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు యాక్సిస్‌ బ్యాంకు అధ్యక్షురాలు అర్నికా దీక్షిత్‌ తెలిపారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఎంఎస్‌ఎంఈ రుణాల్లో యాక్సిస్‌ బ్యాంకుకు 8.4 శాతం వాటా ఉంది. ఈ రంగానికి తాము మంజూరు చేసే రుణాలు ఏటా 17 శాతం పెరుగుతున్నట్లు ఆమె వివరించారు. అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఈ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం... తదితర నగరాల్లోని 350 మందికి పైగా ఎంఎస్‌ఎంఈ వినియోగదార్లను యాక్సిస్‌ బ్యాంకు సత్కరించింది. తమ శాఖల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు యాక్సిస్‌ బ్యాంకు వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని