భారత్‌ ఎలక్ట్రానిక్స్‌కు రూ.3,172 కోట్ల ఆర్డర్లు

నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌) రూ.3,172 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది.

Published : 29 Jun 2024 02:56 IST

దిల్లీ: నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌) రూ.3,172 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. చెన్నై కేంద్రంగా పనిచేసే ఆర్మర్డ్‌ వెహికల్స్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఏవీఎన్‌ఎల్‌)తో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీఈఎల్‌ తెలిపింది. ఇందులో భాగంగా అధునాతన, దేశీయంగా డిజైన్, అభివృద్ధి చేసిన సైటింగ్‌ అండ్‌ ఫైర్‌ కంట్రోల్‌ వ్యవస్థ(ఎఫ్‌సీఎస్‌) సరఫరా, ఇన్‌స్టాలేషన్‌ బాధ్యతలను బీఈఎల్‌ చేపట్టనుంది. భారత సైన్యానికి బీఎంపీ 2/2కే ట్యాంక్‌లను ఆధునికీకరణకు ఇది తోడ్పడుతుంది. అదనంగా డాప్లర్‌ వెదర్‌ రాడార్, క్లాస్‌రూమ్‌ జామర్స్, విడిభాగాలు, సేవల కోసం రూ.481 కోట్ల ఆర్డర్లను బీఈఎల్‌ పొందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం రూ.4,803 కోట్ల ఆర్డర్లను బీఈఎల్‌ అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని