28 నుంచి నెఫ్రో కేర్‌ ఐపీఓ

కోల్‌కతా ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మూత్రపిండాల సంరక్షణ సేవలు అందించే సంస్థ నెఫ్రో కేర్‌ ఇండియా లిమిటెడ్‌ ఈ నెల 28 నుంచి ఐపీఓకు రాబోతోంది.

Published : 26 Jun 2024 02:09 IST

దిల్లీ: కోల్‌కతా ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మూత్రపిండాల సంరక్షణ సేవలు అందించే సంస్థ నెఫ్రో కేర్‌ ఇండియా లిమిటెడ్‌ ఈ నెల 28 నుంచి ఐపీఓకు రాబోతోంది. రూ.41 కోట్లకు పైగా నిధులను ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించనుంది. ఇష్యూ ధర రూ.85-90. యాంకర్‌ మదుపర్లు ఒక రోజు ముందుగానే (జూన్‌ 27న) దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 2న ఐపీఓ ముగుస్తుంది. ఈ ఐపీఓలో 45.84 లక్షల తాజా ఈక్విటీ షేర్లను (రూ.41.26 కోట్లు) ఆఫర్‌ చేయనుంది. ఇష్యూ తర్వాత కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌ ప్లాట్‌ఫామ్‌పై నమోదవుతాయి. ఐపీఓ ద్వారా సమకూరిన నిధుల్లో  రూ.26.17 కోట్లను కోల్‌కతాలో మల్టీ స్పెషాల్టీ హెల్త్‌కేర్‌ ఆస్పత్రిని నిర్మించేందుకు వినియోగించనుంది. ఇందులో 100 పడకలు (30 పడకల క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌) ఉంటాయి. ఇక్కడ గుండె సంబంధిత జబ్బులు, క్యాన్సర్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, గైనకాలజీ తదితర విభాగాలతో పాటు మూత్రపిండాల మార్పిడికి అడ్వాన్స్‌డ్‌ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం 9 నెలల్లో (2023 ఏప్రిల్‌-డిసెంబరు) నెఫ్రో కేర్‌ రూ.19.75 కోట్ల ఆదాయాన్ని, రూ.3.4 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కార్పొరేట్‌ క్యాపిటల్‌ వెంచర్స్‌ ఈ ఇష్యూకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్‌గా, బిగ్‌షేర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రిజిస్ట్రార్‌గా వ్యవహరించనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు