Hero motocorp: హీరో కరిజ్మా మళ్లీ వచ్చింది

హీరో మోటోకార్ప్‌ తమ కరిజ్మా బ్రాండ్‌ను దేశంలో మళ్లీ పరిచయం చేసింది. కరిజ్మా ఎక్స్‌ఎమ్‌ఆర్‌ను రూ.1.72 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) పరిచయ ధరతో మంగళవారం విపణిలోకి విడుదల చేసింది.

Published : 30 Aug 2023 07:42 IST

ధర రూ.1.72 లక్షలు

దిల్లీ: హీరో మోటోకార్ప్‌ తమ కరిజ్మా బ్రాండ్‌ను దేశంలో మళ్లీ పరిచయం చేసింది. కరిజ్మా ఎక్స్‌ఎమ్‌ఆర్‌ను రూ.1.72 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) పరిచయ ధరతో మంగళవారం విపణిలోకి విడుదల చేసింది. 210 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ మేటెడ్‌, 6 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌తో ఈ బైకుల్ని విడుదల చేసింది. కరిజ్మా ఎక్స్‌ఎమ్‌ఆర్‌ విడుదలతో ప్రీమియం విభాగంలో మా విజయానికి మార్గం సుగమమవుతుందని సీఈఓ నిరంజన్‌ గుప్తా తెలిపారు. స్థానికంగా ఉత్పత్తి చేసిన హార్లే డేవిడ్‌సన్‌ ఎక్స్‌440 బైకుల్ని కూడా గత జులైలో కంపెనీ ప్రీమియం విభాగంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ప్రీమియం విభాగంలో కొత్త మోడళ్లు

దేశీయ విపణిలో ప్రీమియం బైకుల విభాగంలో మార్కెట్‌ వాటాను పెంచుకునేందుకు వీలుగా కొత్త మోడళ్లను తీసుకురాబోతున్నట్లు హీరో మోటోకార్ప్‌ సీఈఓ నిరంజన్‌ గుప్తా వెల్లడించారు. ప్రస్తుతం ప్రీమియం బైకుల విభాగంలో హీరోకు 4-5 శాతం మార్కెట్‌ వాటా ఉందని, ఏడాదికి 20-25 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. 150 సీసీ కంటే తక్కువ ప్రారంభ స్థాయి, కమ్యూటర్‌ విభాగాల్లో కంపెనీ మంచి స్థాయిలో ఉందని, 150-450 సీసీ బైకుల విభాగంలో ఉనికిని పెంచుకునేందుకు వచ్చే ఏడాది కాలంలో ప్రతి త్రైమాసికంలో ఒక కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. ‘ప్రీమియం విభాగంలో మా ఆట ఇప్పుడే మొదలుపెట్టాం. అందుకే ఈ విభాగంలో 4-5 శాతం మాత్రమే మార్కెట్‌ వాటా ఉంది. ఇది ప్రారంభం మాత్రమే’ అని నిరంజన్‌ తెలిపారు. వచ్చే 8 త్రైమాసికాల్లో 500 విక్రయశాలలకు చేరుకోవాలనుకుంటున్నామని, ఇందులో వచ్చే 4 త్రైమాసికాల్లో ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లను కలిగి ఉంటామన్నారు. ప్రీమియం విభాగంలో గెలవడానికి కొత్త ఉత్పత్తులతో పాటు 360 డిగ్రీల విధానాన్ని అనుసరిస్తున్నామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని