ఎస్‌బీఐ ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు.. ప్రతిపాదించిన ఎఫ్‌ఎస్‌ఐబీ

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తదుపరి ఛైర్మెన్‌గా.. బ్యాంక్‌ ప్రస్తుత డైరెక్టర్లలో ఒకరైన శ్రీనివాసులు శెట్టిని నియమించాలని ఎఫ్‌ఎస్‌ఐబీ ప్రతిపాదించింది.

Published : 29 Jun 2024 19:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ (SBI) తదుపరి ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టిని నియమించాలని కేంద్ర పరిధిలోని స్వయంప్రతిపత్త సంస్థ అయిన ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇనిస్టిట్యూషన్స్‌ బ్యూరో (FSIB) ప్రతిపాదించింది. పనితీరును దృష్టిలో ఉంచుకొని శెట్టిని సిఫార్సు చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఐబీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 

ఎస్‌బీఐ ఛైర్మన్‌ పదవి కోసం ఎఫ్‌ఎస్‌బీఐ ముగ్గురు వ్యక్తులను ఇంటర్వ్యూ చేసింది. వీరిలో బ్యాంక్‌ ప్రస్తుత డైరెక్టర్లలో ఒకరైన శెట్టిని ఎంపిక చేసింది. శ్రీనివాసులు అత్యంత సీనియర్‌ ఉద్యోగి. దాదాపు 36ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం ఎస్‌బీఐ ఛైర్మన్‌గా దినేష్‌ ఖరా పదవీకాలం ఆగస్టు 28న ముగియనుంది.

జియో vs ఎయిర్‌టెల్‌ vs వొడాఫోన్‌ ఐడియా.. పాపులర్‌ ప్లాన్ల లేటెస్ట్‌ ధరలు ఇవే..

శ్రీనివాసులు శెట్టి 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్‌బీఐలో చేరారు. 2020లో ఎస్‌బీఐ బోర్డులో ఎండీగా నియమితులయ్యారు. ప్రస్తుతం అంతర్జాతీయ బ్యాంక్‌, గ్లోబల్‌ మార్కెట్స్‌ అండ్‌ టెక్నాలజీ వింగ్స్‌ బాధ్యతలు చూస్తున్నారు. కార్పొరేట్ క్రెడిట్, రిటైల్, డిజిటల్, ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌లో విశేష అనుభవం ఉంది. అయితే ఎఫ్‌ఎస్‌ఐబీ సిఫార్సు తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్‌ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని