Domestic LPG cylinders: సిలిండర్లకు క్యూఆర్‌ కోడ్‌!

నివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్‌ పంపులు పని చేసేలా, అవసరమైన భద్రతా చర్యల నమూనా రూపొందించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, పెసో (పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌)ను ఆదేశించారు.

Published : 05 Jul 2024 03:48 IST

దిల్లీ: నివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్‌ పంపులు పని చేసేలా, అవసరమైన భద్రతా చర్యల నమూనా రూపొందించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, పెసో (పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌)ను ఆదేశించారు. డీపీఐఐటీ (పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం) కింద పని చేసే పెసో, 1884 ఎక్స్‌ప్లోజివ్స్‌ చట్టం, 1934 పెట్రోలియం చట్టం నిబంధనలను నియంత్రించే కీలక బాధ్యతను పర్యవేక్షిస్తుంది. పెసో మంజూరు చేసిన లైసెన్స్‌ల లైసెన్సింగ్‌ ఫీజులో మహిళా పారిశ్రామికవేత్తలకు 80%, ఎంఎస్‌ఎంఈలకు 50% రాయితీని మంత్రి ప్రకటించారు. గ్యాస్‌ సిలిండర్లకు క్యూఆర్‌ కోడ్‌ ఇవ్వాలనే ప్రతిపాదనను, గ్యాస్‌ సిలిండర్ల ముసాయిదాలో చేర్చామని, దీనిపై తుది నోటిఫికేషన్‌ తదుపరి వస్తుందని  వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని