BSNL users Data: రిస్క్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్ల డేటా.. అమ్మకానికి ఉంచిన హ్యాకర్‌!

Data Breached: బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్ల డేటా మరోసారి ప్రమాదంలో పడింది. వినియోగదారులకు చెందిన 278 జీబీ డేటాను ఓ వ్యక్తి అమ్మకానికి పెట్టినట్లు అథెంటియన్ టెక్నాలజీస్‌ పేర్కొంది. 

Published : 26 Jun 2024 16:52 IST

BSNL Data Breached | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) యూజర్ల డేటా మరోసారి ప్రమాదంలో పడింది. వినియోగదారుల వ్యక్తిగత డేటా లీకైంది. గత ఆరు నెలల్లో కస్టమర్ల డేటా హ్యాక్‌ అవ్వడం ఇది రెండోసారి. ఈ డేటాలో సిమ్‌ కార్డ్‌ వివరాలు, అంతర్జాతీయ మొబైల్‌ చందాదారుల గుర్తింపు (IMSI), హోమ్‌ లొకేషన్‌.. వంటి సమాచారం ఉన్నట్లు అథెంటియన్ టెక్నాలజీస్‌ పేర్కొంది. 

బీఎస్‌ఎన్ఎల్‌కు చెందిన 278 జీబీ డేటా ఉందంటూ కిబర్‌ ఫాంటోమ్‌ అనే వ్యక్తి 5000 డాలర్లకు అమ్మకానికి పెట్టినట్లు అథెంటియన్‌ టెక్నాలజీస్‌ తన నివేదికలో పేర్కొంది. నకిలీ సిమ్‌ కార్డ్‌లను సృష్టించడానికి ఈ డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ వివరాలను ఉపయోగించి యూజర్ల వ్యక్తిగత ఖాతాలను నేరగాళ్లు అనధికారికంగా యాక్సెస్‌ చేయడం, సైబర్‌ దాడులు, మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఐపీ రేటింగ్‌ అంటే ఏంటి? IP67, IP68ని ఎలా అర్థం చేసుకోవాలి?

గతేడాది డిసెంబరులో ఇలానే బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌, ల్యాండ్‌లైన్‌ యూజర్ల డేటా బయటకు పొక్కింది. మరోవైపు . త్వరలోనే దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు బీఎన్‌ఎస్‌ఎల్‌ ఓవైపు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో డేటా హ్యాక్‌కు గురవ్వడం ఆందోళన రేపుతోంది. ఈ తరహా డేటా లీకేజీ వల్ల కంపెనీలు వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోవడంతో పాటు న్యాయపరమైన చిక్కులూ ఎదుర్కోవాల్సి ఉంటుందని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు