IRCTC: ఐఆర్‌సీటీసీ.. వ్యక్తిగత ఐడీతో టికెట్‌ బుక్‌ చేసి ఇతరులకు విక్రయిస్తే చిక్కులే!

వ్యక్తిగత ఐడీతో రైలు టికెట్లు బుక్‌ చేసి ఇతరులకు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Updated : 25 Jun 2024 16:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐఆర్‌సీటీసీ ద్వారా ఆన్‌లైన్‌లో రైలు టికెట్‌ బుక్‌ చేసుకోవడంతోపాటు ఒక్కోసారి బంధువులు, స్నేహితులకూ సాయం చేస్తుంటారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. ఇతరులకు టికెట్లు అమ్మడాన్ని మాత్రం  రైల్వేశాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వ్యక్తిగత ఐడీతో టికెట్‌ బుక్‌ చేసి వ్యాపారంలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జైలుశిక్షతోపాటు భారీ జరిమానా పడుతుంది. ఇందుకు సంబంధించి బుకింగ్‌ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొంది.

రైల్వే చట్టం సెక్షన్‌ 143 ప్రకారం.. కేవలం అధికారిక గుర్తింపు పొందిన ఏజెంట్లు మాత్రమే థర్డ్‌ పార్టీ బుకింగ్‌ వీలుంటుంది. అంటే వీరు మాత్రమే ఇతరులకు బుకింగ్‌ చేయగలరు. దీన్ని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.10వేల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

నిబంధనల ప్రకారం వ్యక్తిగత ఐడీతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకు టికెట్‌ బుక్‌ చేయొచ్చు. ఆధార్‌తో లింకు చేసుకున్న యూజర్‌ నెలకు 24టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. అది లేకుండా చేస్తే 12టికెట్ల వరకు పరిమితం ఉంటుంది. టికెట్‌ బుక్‌ చేసి లాభార్జనే లక్ష్యంగా విక్రయిస్తే నిబంధనలు అతిక్రమించినట్లే. టికెట్‌ రిజర్వేషన్‌ వ్యవస్థలో దుర్వినియోగాన్ని కట్టడి చేయడంతోపాటు పారదర్శకత కోసమే ఈ నిబంధన రైల్వేశాఖ ఈ నిబంధన తీసుకువచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని