BMW: బీఎండబ్ల్యూ రికార్డు స్థాయి విక్రయాలు

దేశంలో గతంలో ఎన్నడూ నమోదు కాని స్థాయిలో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో (జనవరి-జూన్‌) వాహనాలను విక్రయించినట్లు బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా వెల్లడించింది.

Updated : 03 Jul 2024 02:38 IST

దిల్లీ: దేశంలో గతంలో ఎన్నడూ నమోదు కాని స్థాయిలో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో (జనవరి-జూన్‌) వాహనాలను విక్రయించినట్లు బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా వెల్లడించింది. 2024 తొలి 6 నెలల్లో మొత్తం 7,098 వాహనాలను వినియోగదార్లకు డెలివరీ ఇచ్చినట్లు సంస్థ పేర్కొంది. 2023 జనవరి-జూన్‌ మధ్య విక్రయించిన 5,867 వాహనాలతో పోలిస్తే ఇవి 21% అధికం. 3,614 బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ మోటార్‌సైకిల్స్‌ను విక్రయించింది. స్పోర్ట్స్‌ యాక్టివిటీ వాహనాలు, విలాస తరగతి, విద్యుత్‌ కార్లకు అధిక గిరాకీ లభిస్తోందని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పావా వెల్లడించారు.

5% తగ్గిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ జూన్‌లో 73,141 వాహనాలు విక్రయించింది. 2023 జూన్‌లో అమ్మిన 77,109 బైక్‌లతో పోలిస్తే, ఇవి 5% తక్కువ. దేశీయ విక్రయాలు 67,495 నుంచి 2% తగ్గి 66,117కు పరిమితమయ్యాయి. ఎగుమతులు 9,614 నుంచి 27% క్షీణించి 7,024కు పరిమితమయ్యాయి. ఈ ఏడాది మరిన్ని కొత్త బైక్‌ల ఆవిష్కరణతో, ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేస్తామని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సీఈఓ బి.గోవిందరాజన్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని