Airtel: ఎయిర్‌టెల్‌ కొత్త డేటా వోచర్‌.. రూ.9కే 10జీబీ డేటా, కానీ..

Airtel: తక్కువ ధరతో అధిక డేటా పొందేలా ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. కానీ, దీంట్లో ఓ తిరకాసు ఉంది. అదేంటో చూద్దాం..!

Published : 21 Jun 2024 15:21 IST

Bharti Airtel | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని ధర కేవలం రూ.9 మాత్రమే. ఇది ఒక డేటా వోచర్‌. దీంతో ఎలాంటి సర్వీస్‌ వ్యాలిడిటీ ఉండదు. మొత్తం 10 జీబీ డేటా లభిస్తుంది. కానీ, తిరకాసు ఇక్కడే ఉంది. దీన్ని కేవలం ఒక గంటలోనే వాడేసుకోవాలి.

ఈ రూ.9 ప్లాన్‌ అందరికీ ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. ఏదైనా పెద్ద సైజ్‌ డేటా ఫైల్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడమో లేదా స్వల్పకాలం కోసం వేగవంతమైన డేటా కావాల్సి వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఇతర సర్వీస్‌ ప్రొవైడర్లలో 10జీబీ డేటా కావాలంటే రూ.100కు పైగానే చెల్లించాల్సి వస్తోంది. మొబైల్‌ యాప్‌ లేదా ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) వెబ్‌సైట్‌ నుంచి ఈ ప్లాన్‌ను రీఛార్జ్‌ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని