IPO: ఎంక్యూర్‌ ఫార్మా, బన్సల్‌ వైర్‌ ఐపీఓలు ప్రారంభం.. ₹2,700 కోట్ల సమీకరణ

IPO: రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఎంక్యూర్‌ ఫార్మా, బన్సల్‌ వైర్‌ ఐపీఓలు ప్రారంభమయ్యాయి. జులై 5 వరకు ఆయా కంపెనీల షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు.

Published : 03 Jul 2024 11:21 IST

దిల్లీ: ఎంక్యూర్‌ ఫార్మా ఐపీఓ (Emcure Pharma IPO) బుధవారం ప్రారంభమైంది. జులై 5 వరకు షేర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ధరల శ్రేణిని రూ.960- 1,008గా కంపెనీ నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.1,952 కోట్లు సమీకరించనుంది. కొత్తగా రూ.860 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా రూ.1,152 కోట్లు విలువ చేసే షేర్లు అందుబాటులో ఉంచింది. మదుపర్లు కనీసం రూ.14,112తో 14 షేర్లకు బిడ్లు దాఖలు చేయాలి.

ఈ ఐపీఓలో (IPO) ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కొన్ని షేర్లను రిజర్వ్‌ చేశారు. అర్హత గల సంస్థాగత మదుపర్లకు (QIBs) 50 శాతం, రిటైల్‌ మదుపర్లకు 35 శాతం, సంస్థాగతేతర మదుపర్లకు (NIIs) 15 శాతం షేర్లను కేటాయించారు. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగిస్తామని ఎంక్యూర్‌ ఫార్మా తెలిపింది. పుణె కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ వివిధ రకాల ఔషధాల అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్ వంటి కార్యకలాపాలు చేపడుతోంది.

హిండెన్‌బర్గ్‌కు సెబీ షోకాజ్‌

ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..

  • తేదీలు : జులై 3 - 5
  • ధరల శ్రేణి : రూ.960 - 1,008
  • కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు : 14 (ఒక లాట్‌)
  • కనీస పెట్టుబడి : రూ.14,112
  • షేర్ల అలాట్‌మెంట్‌ : జులై 8
  • రిఫండ్లు : జులై 9
  • డీమ్యాట్‌ ఖాతాలకు షేర్ల బదిలీ : జులై 9
  • లిస్టింగ్ తేదీ : జులై 10

బన్సల్‌ వైర్‌ ఐపీఓ..

స్టీల్‌ వైర్ల తయారీ సంస్థ బన్సల్‌ వైర్‌ ఇండస్ట్రీస్‌ (Bansal Wire Industries IPO) ఐపీఓ సైతం నేడే ప్రారంభమైంది. జులై 5 వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. రూ.745 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. షేరు ధరల శ్రేణిని రూ.243-256గా నిర్ణయించింది. ఈ ఐపీఓ పూర్తిగా కొత్త షేర్ల జారీ ద్వారానే జరుగుతోంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఎలాంటి షేర్లు అందుబాటులో లేవు. మదుపర్లు కనీసం రూ.14,848తో 58 షేర్లకు బిడ్లు దాఖలు చేయాలి.

ఈ ఐపీఓలో (IPO) సమీకరించిన నిధులతో కంపెనీ కొత్త రకం వైర్ల తయారీలోకి ప్రవేశించే యోచనలో ఉంది. అందుకనుగుణంగా దాద్రీలోని తయారీకేంద్రంలో మార్పులు చేయనుంది. అర్హత గల సంస్థాగత మదుపర్లకు (QIBs) 50 శాతం, రిటైల్‌ మదుపర్లకు 35 శాతం, సంస్థాగతేతర మదుపర్లకు (NIIs) 15 శాతం షేర్లను కేటాయించారు. ఈ కంపెనీ హై కార్బన్‌ స్టీల్‌ వైర్‌, మైల్డ్ స్టీల్‌ వైర్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వైర్‌.. ఇలా మూడు విభాగాల్లో వైర్లను తయారుచేస్తోంది.

ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..

  • తేదీలు : జులై 3 - 5
  • ధరల శ్రేణి : రూ.243 - 256
  • కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు : 58 (ఒక లాట్‌)
  • కనీస పెట్టుబడి : రూ.14,848
  • షేర్ల అలాట్‌మెంట్‌ : జులై 8
  • రిఫండ్లు : జులై 9
  • డీమ్యాట్‌ ఖాతాలకు షేర్ల బదిలీ : జులై 9
  • లిస్టింగ్ తేదీ : జులై 10
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు