Bajaj CNG Bike: బజాజ్‌ నుంచి సీఎన్‌జీ బైక్‌.. రిలీజ్‌కు ముందే వివరాలు లీక్!

Bajaj CNG Bike: బజాజ్‌ సీఎన్‌జీ బైక్‌ జులై 5న విడుదల కానుంది. ఈనేపథ్యంలో కొన్ని వివరాలు బయటకొచ్చాయి.

Updated : 04 Jul 2024 14:30 IST

Bajaj CNG Bike | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ (Bajaj CNG Bike) విడుదలకు సిద్ధమైంది. భారత మార్కెట్లోకి బజాజ్‌ కంపెనీ దీన్ని జులై 5న విడుదల చేయనుంది. పెట్రోల్‌ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వాహనదారులకు.. సీఎన్‌జీ బైక్‌ వస్తోందన్న ప్రకటన ఆశలు రేపింది. దీంతో బైక్‌ ప్రియులు దీనికోసం కొన్ని నెలలుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బైక్‌ విడుదలకు ముందు కంపెనీ కొన్ని వివరాలను టీజ్‌ చేస్తూ ఓ వీడియోను విడుదల చేయగా.. మరికొన్ని వివరాలు బయటకు లీకయ్యాయి.

అన్‌లిమిటెడ్‌ క్లెయిం మొత్తంతో ఐసీఐసీఐ ఆరోగ్య బీమా పాలసీ!

బజాజ్‌ కంపెనీ రిలీజ్‌ చేసిన వీడియో ప్రకారం.. ఇది రౌండ్‌ హెడ్‌ల్యాంప్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో బజాజ్‌ విడుదల చేసిన సీటీ 110 మోడల్‌ను పోలినట్లు అర్థమవుతోంది. మరీ ముఖ్యంగా ఇందులో సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌ ఆప్షన్‌నూ అందించనున్నారు. దీనికోసం ఓ బటన్‌ను ఇచ్చారు. ఏ ఫ్యూయల్‌తో నడపాలంటే దాంతో నడపొచ్చు. సీఎన్‌జీ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని నేపథ్యంలో ఈ సమస్యకు బజాజ్‌ పెట్రోల్‌ ఆప్షన్‌తో పరిష్కారం చూపనుందని తెలుస్తోంది. ఇక ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న కొన్ని వివరాల ప్రకారం.. ఇది 125 సీసీ ఇంజిన్‌తో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్‌కు బజాజ్‌ ఫ్రీడమ్‌ 125 పేరును ఖరారు చేశారని టాక్‌. ధర కూడా రూ.80 వేలు నుంచి రూ.లక్ష వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని