Bajaj Auto: త్వరలో సీఎన్‌జీ ఆటో ట్యాక్సీ.. ప్రకటించిన బజాజ్‌ ఆటో

Bajaj Auto: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ సీఎన్‌జీతో పనిచేసే తొలి ఆటో ట్యాక్సీని త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రకటించింది.

Published : 05 Jul 2024 22:08 IST

Bajaj Auto | ఇంటర్నెట్‌డెస్క్‌: చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న  ప్రపంచంలోని తొలి సీఎన్‌జీ (CNG) బైక్‌ను ప్రముఖ ఆటో దిగ్గజం బజాజ్‌ ఆటో (Bajaj auto) శుక్రవారం విడుదల చేసింది.  ఫ్రీడమ్‌ 125 (Freedom 125) పేరుతో దీన్ని లాంచ్‌ చేసింది. త్వరలోనే సీఎన్‌జీతో నడిచే తొలి ఆటో ట్యాక్సీని తీసుకురానున్నట్లు ఆవిష్కరణ సమయంలో వెల్లడించింది. దేశంలో మొట్టమొదటి ఆటో టాక్సీ క్యూట్‌ (Qute)ను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు కంపెనీ ఈడీ రాకేష్‌ శర్మ్‌ తెలిపారు.

ప్రపంచంలోనే తొలి CNG బైక్‌ వచ్చేసింది.. ధర, ఇతర వివరాలు ఇవే..!

ఇప్పటికే సీఎన్‌జీ త్రీ వీలర్‌ రంగంలో తన సత్తా చాటుతున్న బజాజ్‌.. తాజాగా తన వాహన వ్యాపారంలో సంచలనం నమోదు చేసే దిశగా అడుగులు వేస్తోంది.  తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయడంలో భాగంగా క్యూట్‌ను త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ క్యూట్‌ 4 సీటర్‌ హ్యాచ్‌బ్యాక్‌తో రానుంది. ఎల్‌పీజీ, సీఎన్‌జీ రెండు వేరియంట్లలో లభించనుంది. ఆల్-వెదర్ మోనోకోక్ బాడీతో రానున్న ట్యాక్సీ నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. అయితే ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని