Apple School Sale: మొదలైన యాపిల్‌ స్కూల్‌ సేల్‌.. ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌, ఐమ్యాక్‌పై డిస్కౌంట్లు

Apple School Sale: యాపిల్‌ స్కూల్‌ సేల్‌ ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 20వరకు కొనసాగే ఈ సేల్‌లో ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌, ఐమ్యాక్‌, ఐమ్యాక్‌ మినీపై రాయితీ ఇస్తోంది. వాటి వివరాలపై ఓ లుక్కేయండి.

Updated : 21 Jun 2024 19:36 IST

Apple School Sale 2024 | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెక్‌ కంపెనీ యాపిల్‌ స్కూల్‌ సేల్‌ (Apple School Sale) ప్రారంభమైంది. ఇందులో ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌, ఐ మ్యాక్‌పై పెద్ద ఎత్తున డిస్కౌంట్‌ అందిస్తోంది. నిర్దిష్ట కొనుగోళ్లు చేసిన వారికి ఎయిర్‌పాడ్స్‌, యాపిల్‌ పెన్సిల్‌ ఉచితంగా ఇస్తోంది. విద్యార్ధులు, తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన సేల్‌ సెప్టెంబర్‌ 20 వరకు అందుబాటులో ఉంటుంది. కేవలం యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో మాత్రమే ఈ ఆఫర్లు పొందొచ్చు. రాయితీల వివరాలు ఇలా..

ఐప్యాడ్‌ ఎయిర్‌

  • 11 అంగుళాల ఐప్యాడ్‌ ఎయిర్‌ (వైఫై మోడల్‌)+ 128జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.54,990. 
  • 13 అంగుళాల ఐప్యాడ్‌ ఎయిర్‌ (వైఫై మోడల్‌)+ 128జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.74,990. 

యాపిల్‌ మే నెలలో తీసుకొచ్చిన ఐప్యాడ్‌ ఎయిర్‌(iPad Air)లో శక్తిమంతమైన ఎం2 (M2) చిప్‌ను అమర్చారు. లిక్విడ్‌ రెటినా డిస్‌ప్లేతో వీటిని లాంచ్‌ చేశారు. బ్లూ, పర్పుల్‌, స్టార్‌లైట్‌, స్పేస్‌ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. ముందుభాగంలో 12 ఎంపీ అల్ట్రా వైడ్‌ కెమెరా, వెనక వైపు 12 ఎంపీ వైడ్‌ కెమెరా ఇచ్చారు. పైన పేర్కొన్న డిస్కౌంట్లు కేవలం వైఫై మోడల్‌కు మాత్రమే వర్తిస్తాయి. వైఫై+ సెల్యులార్‌ మోడల్‌ కావాలంటే కాస్త ఎక్కువ చెల్లించాల్సిందే. అయితే వీటి కొనుగోలుపై రూ.6,900 విలువ చేసే యాపిల్‌ పెన్సిల్‌ ఉచితంగా పొందొచ్చు.

ఇన్‌స్టా కొత్త ఫీచర్‌.. లైవ్‌స్ట్రీమ్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్‌కు మాత్రమే!

ఐప్యాడ్‌ ప్రో 

  • 11 అంగుళాల ఐప్యాడ్‌ ప్రో (వైఫై మోడల్‌)+256జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.89,900.
  • 13 అంగుళాల ఐప్యాడ్‌ ప్రో (వైఫై మోడల్‌)+256జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.1,19,900.

ఐప్యాడ్‌ ప్రో(iPad Pro)లో ఎం4 (M4) చిప్‌ అమర్చారు. 11 అంగుళాలు, 13 అంగుళాల డిస్‌ప్లే సైజుల్లో అత్యాధునిక టెన్డం ఓఎల్‌ఈడీ అల్ట్రా రెటినా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. సిల్వర్‌, స్పేస్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. ముందుభాగంలో 12 ఎంపీ అల్ట్రా వైడ్‌ కెమెరా, వెనకవైపు 12ఎంపీ వైడ్‌ కెమెరా అమర్చారు. థండర్‌బోల్డ్‌ 3, యూఎస్‌బీ 4, వైఫై 6ఈ, 5జీ, యూఎస్‌బీ-సీకి ఈ ప్యాడ్‌ సపోర్ట్‌ చేస్తుంది. వీటి కొనుగోలుపై రూ.10,900 విలువ గల యాపిల్‌ పెన్సిల్‌ ప్రోను ఉచితంగా అందిస్తోంది.

మ్యాక్‌బుక్‌ ఎయిర్‌

  • 13 అంగుళాల మ్యాక్‌బుక్‌ ఎయిర్‌(M2), 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.89,990.
  • 13 అంగుళాల మ్యాక్‌బుక్‌ ఎయిర్‌(M3), 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.1,04,900.
  • 15 అంగుళాల మ్యాక్‌బుక్‌ ఎయిర్‌(M3), 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.1,24,900.

2022లో యాపిల్‌ తీసుకొచ్చిన మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ (MacBook Air)లో ఎం2 చిప్‌ అమర్చారు. ఈ ఏడాదిమేలో ఎం3 చిప్ సెట్‌తో దాన్ని అప్‌గ్రేడ్‌ చేసింది. యాపిల్‌ స్కూల్‌ సేల్‌లో ఈ రెండింటిపై రాయితీ ప్రకటించింది. దీని కొనుగోలుపై లైట్నింగ్‌ ఛార్జింగ్‌ కేస్‌తో వచ్చిన ఎయిర్‌పాడ్‌ ఉచితంగా పొందొచ్చు. వీటి ధర రూ.19,900.

మ్యాక్‌బుక్‌ ప్రో

ఎం3, ఎం3 ప్రో, ఎం3 మ్యాక్స్‌ చిప్‌సెట్లో మ్యాక్‌బుక్‌ ప్రో(MacBook Pro) మోడల్స్‌ను ఆవిష్కరించింది. 120Hz రిఫ్రెష్‌రేట్‌, 1600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంటాయి. వైఫై 6E, బ్లూటూత్ 5.3, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 14 అంగుళాల మ్యాక్‌బుక్‌ ప్రో ఈ సేల్‌లో రూ.1,58,900కు లభిస్తోంది. ఇక 16 అంగుళాల డిస్‌ప్లే ధర రూ.2,29,900. ఎం3 చిప్‌సెట్‌తో తీసుకొచ్చిన ఐమ్యాక్‌ (iMac) ఈ సేల్‌లో రూ.1,29,900కే లభిస్తోంది. మ్యాక్‌ మినీ (ఎం2)ని రూ.49,900కే కొనుగోలు చేయొచ్చు. వీటి కొనుగోళ్లపై 3జెన్‌ ఎయిర్‌పాడ్స్‌ ఉచితంగా పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని