Amazom prime Day sale: 20-21 తేదీల్లో అమెజాన్‌ ప్రైమ్‌ డే విక్రయాలు

ఈ నెల 20-21 తేదీల్లో 8వ విడత ప్రైమ్‌ డే విక్రయాలు ఉంటాయని అమెజాన్‌ ఇండియా మంగళవారం ప్రకటించింది.

Updated : 03 Jul 2024 02:35 IST

దిల్లీ: ఈ నెల 20-21 తేదీల్లో 8వ విడత ప్రైమ్‌ డే విక్రయాలు ఉంటాయని అమెజాన్‌ ఇండియా మంగళవారం ప్రకటించింది. ఈ సమయంలో అన్ని విభాగాల్లో అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులు ప్రత్యేక రాయితీలను పొందొచ్చని వెల్లడించింది. 450కు పైగా బ్రాండ్‌లలో గొప్ప ఆఫర్లు ఉంటాయని అమెజాన్‌ ప్రైమ్‌ హెడ్, డైరెక్టర్‌ అక్షయ్‌ సాహీ అన్నారు. ప్రైమ్‌ సభ్యులు అదే రోజు లేదా మరుసటిరోజు డెలివరీ పొందొచ్చని పేర్కొన్నారు. మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు సహా ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు ఉంటాయని అమెజాన్‌ తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ డెబిట్‌/ క్రెడిట్‌ కార్డులపై 10%  రాయితీ ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని