Airtel Data Leak: ఎయిర్‌టెల్‌ కస్టమర్ల డేటా లీక్‌?.. ఖండించిన టెలికాం సంస్థ

Airtel Data Leak: తమ కస్టమర్ల వ్యక్తిగత వివరాలు హ్యాకర్లు తస్కరించారని వస్తున్న వార్తల్ని ఎయిర్‌టెల్‌ ఖండించింది.

Updated : 05 Jul 2024 18:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ను ఓ వివాదం చుట్టుముట్టింది. దాదాపు 37.5 కోట్ల మంది కస్టమర్ల వ్యక్తిగత వివరాలు (Airtel Data Leak) హ్యాకింగ్‌కి గురైనట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వీటిని ఎయిర్‌టెల్‌ తీవ్రంగా ఖండించింది.

‘xenZen’ పేరుతో ఉన్న హ్యాకర్.. ఓ డేటాబేస్‌ను ఆన్‌లైన్‌లో ఉంచాడు. దాన్ని ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు సంబంధించిన డేటాగా (Airtel Data Leak) పేర్కొన్నాడు. దాంట్లో యూజర్ల పేర్లు, ఫోన్‌ నెంబర్లు, చిరునామా, ఈమెయిల్‌ ఐడీ తదితర వివరాలు ఉన్నాయని తెలిపాడు. కావాల్సిన వారు 50 వేల డాలర్లు చెల్లించి యాక్సెస్‌ చేసుకోవచ్చని చెప్పుకొచ్చాడు. అయితే, ఆ డేటా బేస్‌లో నిజంగానే కస్టమర్ల వ్యక్తిగత వివరాలు ఉన్నాయా? అనేది ఎవరూ ధ్రువీకరించలేదు.

ఈ వార్తల్ని ఎయిర్‌టెల్‌ అధికార ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. తమ సెక్యూరిటీ వ్యవస్థలోకి ఇతరులు చొరబడిన ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేశామని తెలిపారు. ఎలాంటి లొసుగులు గుర్తించలేదన్నారు. సంస్థ ప్రతిష్ఠను దిగజార్చడానికి కొంతమంది చేస్తున్న కుట్రగా ఆయన అభివర్ణించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని