Airtel Plans: తక్కువ ధరతో ఎక్కువ వ్యాలిడిటీ.. ఎయిర్‌టెల్‌లో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌!

Airtel Plans: ఎయిర్‌టెల్‌ తక్కువ ధరతో ఎక్కువ వ్యాలిడిటీ ఉండేలా మరో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ తరహా ప్రయోజనాలతో రూ.395 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

Published : 19 Jun 2024 16:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ మరో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.279తో వస్తున్న ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 45 రోజులు. వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌లో రీఛార్జ్‌కు ఈ ప్లాన్‌ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ ఇచ్చేలా దీన్ని రూపొందించారు. ఇప్పటికే ఈ తరహా ప్రయోజనాలతో రూ.395తో 70 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చింది.

రూ.279 ప్లాన్‌ వివరాలు..

ఈ ప్లాన్‌ను రీఛార్జ్‌ చేసుకున్నవారికి మొత్తంగా 2జీబీ డేటా లభిస్తుంది. ఇది అయిపోయిన ఒక్కో ఎంబీకి 50 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ ఉంటుంది. 45 రోజుల్లో 600 ఎస్సెమ్మెస్‌లు వాడుకోవచ్చు. తర్వాత ఒక్కో మెసేజ్‌కు రూ.1 ఛార్జ్‌ వర్తిస్తుంది. వీటితో పాటు అపోలో 24/7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్‌లు, వింక్‌ మ్యూజిక్‌ వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. డేటా పెద్దగా ఉపయోగించకుండా.. కేవలం వ్యాలిడిటీ కోసం చూసేవారికి ఈ ప్లాన్‌ సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని