Airtel: జియో బాటలోనే ఎయిర్‌టెల్‌.. టారిఫ్‌ల పెంపు

Airtel: ఎయిర్‌టెల్‌ సైతం టారిఫ్‌లను పెంచింది. పెంచిన రేట్లు జులై 3 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.

Updated : 28 Jun 2024 11:23 IST

దిల్లీ: జియో బాటలోనే ఎయిర్‌టెల్‌ సైతం తమ మొబైల్ సేవల టారిఫ్‌లను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జులై 3 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ప్లాన్ల రకం, వ్యాలిడిటీని బట్టి పెంపు 10-21% వరకు ఉన్నట్లు వెల్లడించింది. ఒక్కో వినియోగదారుడిపై వచ్చే ఆదాయం (ARPU) రూ.300కు పైగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది. అందులోభాగంగానే టారిఫ్‌లను పెంచుతున్నట్లు వెల్లడించింది.

పెంపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగిస్తామని తెలిపింది. పెంపు రోజుకు 70 పైసల కంటే తక్కువే ఉందని వివరించింది. ప్రీపెయిడ్‌ సహా పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్ల ధరలను సైతం సవరించింది.

ప్రీపెయిడ్‌ ప్లాన్లు..

  • రూ.199 ప్లాన్: గతంలో దీని ధర రూ.179. ఇందులో 2GB డేటా, అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు రోజుకు 100 SMSలు లభిస్తాయి.
  • రూ.509 ప్లాన్: ఇంతకుముందు ఈ ప్లాన్ ధర రూ.455. ఇది 6GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను 84 రోజుల పాటు అందిస్తుంది.
  • రూ.1,999 ప్లాన్: గతంలో రూ.1,799. ఇందులో 24GB డేటా, అపరిమిత కాలింగ్, 365 రోజుల పాటు రోజుకు 100 SMSలు ఉంటాయి.
  • రూ.299 ప్లాన్: ఇంతకుముందు రూ.265. ఇది రోజుకు 1GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు 28 రోజుల పాటు వస్తాయి.
  • రూ.349 ప్లాన్: ఇప్పటి వరకు దీని ధర రూ.299గా ఉంది. ఇందులో రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు రోజుకు 100 SMSలు లభిస్తాయి.
  • రూ.409 ప్లాన్: ఇంతకుముందు రూ.359. ఇది రోజుకు 2.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను 28 రోజుల పాటు అందిస్తుంది.
  • రూ.449 ప్లాన్: గతంలో రూ.399. ఇందులో రోజుకు 3GB డేటా, అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు రోజుకు 100 SMSలు ఉంటాయి.
  • రూ.579 ప్లాన్: ఇంతకుముందు దీని ధర రూ.479. ఇది రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, 56 రోజుల పాటు రోజుకు 100 SMSలను ఇస్తుంది.
  • రూ.649 ప్లాన్: గతంలో రూ.549. ఇందులో రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, 56 రోజుల పాటు రోజుకు 100 SMSలు ఉంటాయి.
  • రూ.859 ప్లాన్: ఇంతకుముందు ధర రూ.719. ఇది రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను 84 రోజుల పాటు అందిస్తుంది.
  • రూ.979 ప్లాన్: గతంలో ధర రూ.839. ఇందులో రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, 84 రోజుల పాటు రోజుకు 100 SMSలు వస్తాయి.
  • రూ.3,599 ప్లాన్: ఇంతకుముందు రూ.2,999. ఇది రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు 365 రోజుల పాటు లభిస్తాయి.

రీఛార్జి ప్లాన్ల ధరలను పెంచిన జియో... ఎప్పటి నుంచి అంటే?

డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లు..

  • రూ.22 ప్లాన్: గతంలో దీని ధర రూ.19. ఇందులో ఒకరోజు వ్యాలిడిటీతో 1GB అదనపు డేటా ఉంటుంది.
  • రూ.33 ప్లాన్: ఇంతకుముందు రూ.29, దీంట్లో ఒక రోజు గడువుతో 2GB అదనపు డేటా లభిస్తుంది.
  • రూ.77 ప్లాన్: గతంలో రూ.65, ఇది బేస్ ప్లాన్ గడువు వ్యాలిడిటీతో 4GB అదనపు డేటాను అందిస్తుంది.

పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు..

  • రూ.449 ప్లాన్: ఈ ప్లాన్ రోల్‌ఓవర్, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు,  ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో 40GB డేటాను అందిస్తుంది.
  • రూ.549 ప్లాన్: ఇది రోల్‌ఓవర్‌తో 75GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం, 12 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌, 6 నెలలు అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది.
  • రూ.699 ప్లాన్: కుటుంబాల కోసం, ఈ ప్లాన్‌లో 105GB డేటా రోల్‌ఓవర్, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం, 12 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌, 6 నెలలు అమెజాన్‌ ప్రైమ్‌, 2 కనెక్షన్‌ల కోసం వింక్‌ ప్రీమియం ఉన్నాయి.
  • రూ.1,199 ప్లాన్: పెద్ద కుటుంబాలకు, ఈ ప్లాన్ రోల్‌ఓవర్‌తో 190GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్ 12 నెలల పాటు, అమెజాన్ ప్రైమ్ 4 కనెక్షన్‌లకు అందిస్తుంది.

ఈ కొత్త టారిఫ్‌లు భారతి హెక్సాకామ్ లిమిటెడ్‌తో సహా అన్ని సర్కిళ్లకు వర్తిస్తాయి. సవరించిన ధరలు జూలై 3 నుంచి ఎయిర్‌టెల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని