Adani: మూలధన వ్యయాలను భారీగా పెంచనున్న అదానీ గ్రూప్‌

ప్రముఖ భారత వ్యాపార సంస్థ అదానీ గ్రూప్‌..2025 ఆర్థిక సంవత్సరంలో మూల ధన వ్యయాలను రూ.70 వేల కోట్ల నుంచి రూ.1.30 లక్షల కోట్లకు పెంచనుంది.

Published : 25 Jun 2024 17:26 IST

అహ్మదాబాద్‌: భారత్‌లో ప్రముఖ పోర్ట్‌లతో పాటు అనేక విద్యుత్‌ సంస్థలను నిర్వహించే ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్‌ 2025 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలను రూ.70 వేల కోట్ల నుంచి రూ.1.30 లక్షల కోట్లకు పెంచనుందని సంస్థ CFO జుగేషిందర్‌ సింగ్‌ మంగళవారం తెలిపారు. ఈ వ్యయంలో భాగంగా గ్రూప్‌కు సంబంధించిన పునరుత్పాదక ఇంధన విభాగం అదానీ గ్రీన్‌ ఎనర్జీ 6 గిగావాట్ల సామర్థ్యాన్ని జోడించడానికి రూ.34 వేల కోట్లను వెచ్చించనుందని మీడియా సమావేశంలో తెలిపారు. పోర్ట్‌లు, పవర్‌ యుటిలిటీస్‌, ట్రాన్స్‌మిషన్‌, కోల్‌ ట్రేడింగ్‌ వ్యాపారాలను కలిగి ఉన్న ఈ గ్రూప్‌.. మౌలిక సదుపాయాలపై నమ్మకంతో భారీ పెట్టుబడులు పెడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని