‘మిస్టర్‌ మస్క్‌.. బగ్‌ను ఫిక్స్‌ చేయగలరా?’ స్పందించిన టెస్లా అధినేత

టెస్లా కార్‌ స్క్రీన్‌లోని సమస్యను ఎదుర్కొన్న ఓ చిన్నారి దాన్ని పరిష్కరించగలరా? అంటూ ఎలాన్‌మస్క్‌కు ట్యాగ్‌ చేసింది. దీనిపై మస్క్‌ సమాధానం ఇచ్చారు.

Published : 03 Jul 2024 00:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్(Elon Musk) తన నిర్ణయాలు, వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ‘‘ఎక్స్‌’’ వేదికగా పోస్టులు పెడుతూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అంతే కాదు ఏ సీఈఓ స్పందించని విధంగా నెటిజన్లతో ముచ్చటిస్తుంటారు. అలా తాజాగా మస్క్‌ ప్రతిస్పందించిన తీరు నెటిజన్లను కట్టిపడేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

విద్యుత్‌ వాహన తయారీ సంస్థ టెస్లాకు చెందిన కార్‌ను చైనాకు చెందిన ఓ కుటుంబం వినియోగిస్తోంది. ఆ కార్‌ స్క్రీన్‌లోని బగ్‌ కారణంగా సమస్యను ఎదుర్కొంటోంది ఓ చిన్నారి. ఆ విషయాన్ని ఎలాగైనా మస్క్‌తో పంచుకోవాలనుకుంది. దీని కోసం ఓ చిన్న వీడియోను రికార్డ్‌ చేసింది. ‘‘హలో మిస్టర్‌ మస్క్‌. నా పేరు మోలీ. మీ కారుకు సంబంధించి ఓ ప్రశ్నను అడగాలనుకుంటున్నాను. ఇందులో స్క్రీన్‌ సరిగ్గా పనిచేయడం లేదు. నేను బొమ్మలు వేయడానికి ప్రయత్నిస్తుంటే స్క్రీన్‌ సపోర్ట్‌ చేయడం లేదు. మీరు ఈ బగ్‌ను ఫిక్స్‌ చేయగలరా?’’ అంటూ ఓ క్లిప్‌ను రూపొందించింది.

ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వేదికగా చెలరేగిపోతున్న స్కామర్లు..!

ఆ వీడియోను ఎలాన్‌మస్క్‌కు ట్యాగ్‌ చేస్తూ ‘‘ఎక్స్‌’’ వేదికగా పోస్ట్‌ చేసింది. దీనిపై టెస్లా అధినేత స్పందించారు. ఈ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తానంటూ బదులిచ్చారు. అంతే ఆ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మస్క్‌ ప్రతిస్పందించడంపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ‘స్క్రీన్‌లోని సమస్యను చక్కగా వివరించావ్‌ మోలీ’ అంటూ చిన్నారి మాటలకు ఫిదా అవుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని