IPO: 3 ఐపీఓలు.. రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యం

నిధుల సమీకరణ కోసం ఈ వారం రెండు మెయిన్‌ బోర్డ్‌ ఐపీఓలు, ఒక ఎస్‌ఎంఈ ఐపీఓ రాబోతున్నాయి. మొత్తం రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇవి వస్తున్నాయి.

Updated : 01 Jul 2024 03:25 IST

ఈ వారంలో 11 కంపెనీలు ఎక్స్ఛేంజీల్లో నమోదు

దిల్లీ: నిధుల సమీకరణ కోసం ఈ వారం రెండు మెయిన్‌ బోర్డ్‌ ఐపీఓలు, ఒక ఎస్‌ఎంఈ ఐపీఓ రాబోతున్నాయి. మొత్తం రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇవి వస్తున్నాయి. ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్, బన్సాల్‌ వైర్‌ కంపెనీ మెయిన్‌ బోర్డ్‌ ఐపీఓలు కాగా, యాంబే ల్యాబొరేటరీస్‌ ఎస్‌ఎంఈ ఇష్యూగా రాబోతోంది. అలైడ్‌ బ్లెండర్స్, వ్రజ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ వంటి మెయిన్‌ బోర్డ్‌ కంపెనీలతో పాటు మరో 9 ఎస్‌ఎంఈ కంపెనీల షేర్లు ఈ వారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్నాయి.

  • పుణెకు చెందిన ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఐపీఓ జులై 3-5 తేదీల్లో జరగనుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ.960-1,008. ఈ ఐపీఓ ద్వారా రూ.1,952 కోట్లను సంస్థ సమీకరించబోతోంది. కనీసం 14 షేర్లకు మదుపర్లు బిడ్‌ వేయాలి. రూ.800 కోట్ల విలువైన తాజా షేర్ల జారీతో పాటు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)లో 1.14 కోట్ల ఈక్విటీ షేర్లను సంస్థ ప్రస్తుత వాటాదార్లు, ప్రమోటర్లు విక్రయించనున్నారు. ః బన్సాల్‌ వైర్‌ ఐపీఓ కూడా జులై 3-5 తేదీల్లో రాబోతోంది. ఈ ఇష్యూకు ధరల శ్రేణి రూ.243-256. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.745 కోట్లను సమీకరించబోతోంది. కనీసం 58 షేర్లకు మదుపర్లు బిడ్‌లు దాఖలు చేయాలి.
  • యాంబే ల్యాబొరేటరీస్‌ ఎస్‌ఎంఈ ఐపీఓ రూ.45 కోట్ల సమీకరణ లక్ష్యంతో జులై 4-8 తేదీల మధ్య రాబోతోంది. ఈ ఐపీఓ ద్వారా 62.5 లక్షల తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ జారీ చేయనుంది. 3.12 లక్షల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో విక్రయించనుంది. ఈ ఇష్యూ ధరల శ్రేణి రూ.65-68. మదుపర్లు కనీసం 2,000 షేర్లకు బిడ్‌లు దాఖలు చేయాలి.
  • ఈ వారంలో దలాల్‌ స్ట్రీట్‌లో 11 కంపెనీల షేర్లు నమోదు కానున్నాయి. మెయిన్‌బోర్డ్‌ విభాగంలో వ్రజ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ (జులై 3న), అలైడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిలరీస్‌ (జులై 2న) లిస్ట్‌ కానున్నాయి. ఎస్‌ఎంఈ విభాగంలో నెఫ్రో కేర్‌ ఇండియా, డీన్‌స్టెన్‌ టెక్, కార్బన్‌ అండ్‌ కెమికల్స్, డివైన్‌ పవర్‌ ఎనర్జీ, అకికో గ్లోబల్‌ సర్వీసెస్, వీసామ్యాన్‌ గ్లోబల్‌ సేల్స్, మాసన్‌ ఇన్‌ఫ్రాటెక్, సిల్వాన్‌ ప్లైబోర్డ్‌ (ఇండియా), శివాలిక్‌ పవర్‌ కంట్రోల్‌ కంపెనీల షేర్లు నమోదు కానున్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని