Andhra News: వివేకా హత్య కేసులో కీలక సాక్షి రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి వాచ్‌మన్‌ రంగన్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం బుధవారం కడప రిమ్స్‌కు తరలించారు.

Published : 04 Jul 2024 05:30 IST

ఈనాడు, కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి వాచ్‌మన్‌ రంగన్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం బుధవారం కడప రిమ్స్‌కు తరలించారు. రంగన్న కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో ఇబ్బందిపడుతూ.. పులివెందుల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 2019 మార్చి 15న పులివెందులలో వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం విదితమే. అప్పట్లో వివేకా ఇంటి వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్న రంగన్న సీబీఐకి వాంగ్మూలం ఇస్తూ పలు కీలక అంశాలు బయటపెట్టారు. హత్య కేసులో కీలక సాక్షిగా నమోదు చేసిన సీబీఐ ఛార్జిషీట్‌లో సైతం పలు అంశాలు పేర్కొంది. కేసు విచారణ సమయంలో కీలకంగా ఉపయోగపడే రంగన్న ఆరోగ్య పరిస్థితి తీవ్ర చర్చనీయాంశమైంది. 85 ఏళ్ల రంగన్న వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని