Andhra News: రేషన్‌ సరకుల వ్యాన్‌పై జగన్‌ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం

రేషన్‌ సరకులు పంపిణీ చేసే వ్యాన్‌లపై మాజీ సీఎం జగన్‌ బొమ్మలు తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినా, పాటించకపోవడంపై శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 02 Jul 2024 08:35 IST

తహసీల్దారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే గోవిందరావు

ఎల్‌ఎన్‌పేట, న్యూస్‌టుడే: రేషన్‌ సరకులు పంపిణీ చేసే వ్యాన్‌లపై మాజీ సీఎం జగన్‌ బొమ్మలు తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినా, పాటించకపోవడంపై శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌ఎన్‌పేట మండలం ఎంబరాం గ్రామంలో సోమవారం పింఛన్ల పంపిణీకి ఎమ్మెల్యే వచ్చారు. అదే సమయంలో జగన్‌ చిత్రంతో కూడిన రేషన్‌ సరకుల వాహనం వచ్చింది. అది చూసిన ఎమ్మెల్యే, కారు దిగి వాహనం వద్దకు వెళ్లారు. దొంగల బొమ్మలతో సరకులు ఎలా పంపిణీ చేస్తారని రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహించారు. మీ గ్రామంలో ఇంకా పాత ముఖ్యమంత్రి బొమ్మతో రేషన్‌ అందిస్తుంటే ఏం చేస్తున్నారని తెదేపా నాయకులపై కూడా అసహనం చెందారు. అక్కడి నుంచే మంత్రి అచ్చెన్నాయుడికి ఫోన్‌ చేసి, తహసీల్దారు రాణి అమ్మాజీతో మాట్లాడించారు. ఎండీఎం ఆపరేటర్, రేషన్‌ డీలరును తొలగించాలని, రెవెన్యూ సిబ్బందికి మెమోలు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదేశించారు. దీనిపై జిల్లా అధికారులకు నివేదిక అందజేస్తామని తహసీల్దారు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని