Chandragiri: పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ముంగిళిపట్టు పంచాయతీలో పింఛన్ల అక్రమ బాగోతం వెలుగు చూసింది. వైకాపా సర్పంచి జాగర్లమూడి భారతి దంపతులతోపాటు మరో 20 మంది వరకు అక్రమంగా పింఛన్లు పొందుతున్నట్లు తెదేపా నాయకులు వెల్లడించారు.

Published : 02 Jul 2024 05:26 IST

చంద్రగిరి, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ముంగిళిపట్టు పంచాయతీలో పింఛన్ల అక్రమ బాగోతం వెలుగు చూసింది. వైకాపా సర్పంచి జాగర్లమూడి భారతి దంపతులతోపాటు మరో 20 మంది వరకు అక్రమంగా పింఛన్లు పొందుతున్నట్లు తెదేపా నాయకులు వెల్లడించారు. తెదేపా సూపర్‌ సిక్స్‌ పథకాల అమలులో భాగంగా ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీని సోమవారం ఉదయాన్నే సచివాలయ సిబ్బంది, స్థానిక తెదేపా నాయకుల సమక్షంలో చేపట్టారు. ఎలాంటి వైకల్యం లేకున్నా ప్రతినెలా పింఛన్లు తీసుకుంటున్న ముంగిళిపట్టు సర్పంచి భారతి, ఆమె భర్త దామోదరం నాయుడి పేర్లను చూసి వారు అవాక్కయ్యారు. వీరితోపాటు మరో 20 మంది వరకు వైకాపా సానుభూతిపరులు పింఛన్లు తీసుకుంటున్నట్లు వారు వెల్లడించారు. వాలంటీర్ల అండతో ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా పింఛన్లు పొందగా సచివాలయ సిబ్బందితో పంపిణీ చేపట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 

  • సర్పంచి దంపతులు ఎంతకాలం నుంచి పింఛన్లు పొందుతున్నారన్నదానిపై విచారణ చేపట్టి చర్యల నిమిత్తం కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళతామని, గ్రామసభ నిర్వహించి అనర్హులు ఇంకెంత మంది ఉన్నారో విచారించి తొలగిస్తామని చంద్రగిరి ఎంపీడీవో సూర్యసాయి తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని