Nellore: జగన్‌ పర్యటనలో దొంగల హల్‌చల్‌

మాజీ సీఎం జగన్‌ పర్యటనలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. గురువారం నెల్లూరులోని సెంట్రల్‌ జైలు వద్దకు రాగా.. ఆయన్ను చూసేందుకు వైకాపా కార్యకర్తలు పెద్దఎత్తున గుమిగూడారు.

Published : 05 Jul 2024 07:02 IST

సెల్‌ఫోన్లు దొంగిలించాడని యువకుడిని కొడుతున్న వైకాపా కార్యకర్తలు

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: మాజీ సీఎం జగన్‌ పర్యటనలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. గురువారం నెల్లూరులోని సెంట్రల్‌ జైలు వద్దకు రాగా.. ఆయన్ను చూసేందుకు వైకాపా కార్యకర్తలు పెద్దఎత్తున గుమిగూడారు. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. ఇదే సమయంలో దొంగలు చేతులకు పని చెప్పారు. వెంకటాచలం మండలానికి చెందిన ఓ వైకాపా నాయకుడి జేబు నుంచి రూ.5వేలు కొట్టేశారు. అలాగే 13 సెల్‌ఫోన్లను దొంగతనం చేశారు. ఓ దొంగను వైకాపా నేతలు పట్టుకుని చితకబాదారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని