Andhra News: జగన్‌ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి

వైకాపా అధినేత జగన్‌కు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి బినామీగా వ్యవహరిస్తున్నట్లు ఏపీ సాధు పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు, ఆనందాశ్రమం పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు.

Published : 03 Jul 2024 05:55 IST

ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని తీసేసుకోవాలి

భీమిలి సమీపంలోని కొత్తవలస కొండపై విశాఖ శారదాపీఠానికి వైకాపా ప్రభుత్వం కేటాయించిన భూములను పరిశీలిస్తున్న స్వామిజీలు

విశాఖపట్నం (గ్రామీణ భీమిలి), న్యూస్‌టుడే: వైకాపా అధినేత జగన్‌కు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి బినామీగా వ్యవహరిస్తున్నట్లు ఏపీ సాధు పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు, ఆనందాశ్రమం పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. ఆ పీఠానికి భీమిలిలో కారుచౌకగా కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సంబంధిత భూములను సాధు పరిషత్తు స్వామిజీలు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. భీమిలి మండలం కొత్తవలస కొండపై సర్వే నంబర్‌ 102/3లో 7.36 ఎకరాలు, 103లో 7.64 ఎకరాల భూమిని కేవలం రూ.15 లక్షలకే వైకాపా ప్రభుత్వం స్వామిభక్తితో కేటాయించిందన్నారు. వాస్తవంగా ఆ భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.250 కోట్లుగా ఉంటుందని వెల్లడించారు. 2019కు ముందు రూ.1.40 కోట్లుగా ఉన్న శారదా పీఠం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. ఈ ఐదేళ్లలో రూ.46 కోట్లకు ఎలా పెరిగాయని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని