Aganampudi tollgate: విశాఖలోని అగనంపూడి టోల్‌గేట్‌ తొలగింపు

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ఇన్నాళ్లు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న టోల్‌ వసూళ్లకు ఎట్టకేలకు తెరపడింది.

Updated : 28 Jun 2024 09:30 IST

టోల్‌ అక్రమ వసూళ్లు అడ్డుకున్న తెదేపా

తొలగించిన టోల్‌ కౌంటర్లు పరిశీలిస్తున్న స్థానిక తెదేపా నాయకులు

విశాఖపట్నం (అగనంపూడి), న్యూస్‌టుడే: మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ఇన్నాళ్లు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న టోల్‌ వసూళ్లకు ఎట్టకేలకు తెరపడింది. నగర పరిధి అగనంపూడి టోల్‌గేటును గురువారం తొలగించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ నుంచి టోల్‌ నిర్వహణను గుత్తకు తీసుకున్న సంస్థ ఏటా రుసుములు పెంచుతూ జనంపై భారం మోపుతోంది. గడువు పూర్తయినా వసూళ్లు కొనసాగిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు తెదేపా హయాంలో గాజువాక బార్‌ అసోసియేషన్‌ సభ్యులు కోర్టును ఆశ్రయించి టోల్‌గేటు మూసేయించారు. కానీ, వైకాపా అధికారంలోకి వచ్చాక టోల్‌గేట్‌ను తెరిచి.. వసూళ్లు చేపట్టారు. దీంతో ఇటీవలి ఎన్నికల్లో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజువాక నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు గెలిస్తే టోల్‌గేటు తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం టోల్‌ రుసుము వసూళ్లను అడ్డుకున్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత టోల్‌గేట్‌ కౌంటర్లను కూల్చి వేయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని