Andhra News: తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో నిందితులు

మూడేళ్ల క్రితం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు మంగళవారం అర్ధరాత్రి తర్వాత కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.

Updated : 03 Jul 2024 07:16 IST

మరికొందరి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు 

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: మూడేళ్ల క్రితం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు మంగళవారం అర్ధరాత్రి తర్వాత కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల వివరాలను గత రెండు, మూడు రోజులుగా సేకరించారు. విధ్వంసానికి పాల్పడిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. దుండగుల్లో గుంటూరుకు చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నట్లు నిర్ధారించారు. అయితే, పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని పసిగట్టిన నిందితుల్లో పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరిలో కొందరు తెదేపాలో చేరతామని రాయబారాలు కూడా నడిపినట్లు సమాచారం. అయినా, పోలీసులు గుంటూరుకు చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వైకాపా నాయకులు, విద్యార్థి విభాగం నాయకులను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని