Pinnelli Ramakrishna reddy: దాదాగిరీ వీడని పిన్నెల్లి.. పోలీసుల ముందే తెదేపా నేతపై దాడి

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నా తన దాదాగిరీ వీడలేదు.

Updated : 28 Jun 2024 14:22 IST


తెలుగు యువత జిల్లా కార్యదర్శి కొమెర శివపై దాడికి పాల్పడుతున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

మాచర్ల: ఈవీఎం ధ్వంసం సహా మరికొన్ని కేసుల్లో అరెస్టయిన వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నా తన దాదాగిరీ వీడలేదు. పోలీసులు కోర్టు లోపలికి తీసుకెళ్తున్న తరుణంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి కొమెర శివ ఆయనతో కరచాలనం చేయడానికి ప్రయత్నించారు. అందుకు నిరాకరించిన పిన్నెల్లి.. శివ కడుపులో బలంగా కొట్టారు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని పోలీసులు వెంటనే బాధితుడిని పక్కకు తీసుకెళ్లారు. అంతకు ముందు వైద్యపరీక్షల నిమిత్తం తనను ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా చిత్రీకరిస్తున్న స్థానిక కెమెరామన్‌పైనా పిన్నెల్లి దాడికి యత్నించారు. తనపై మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడికి పాల్పడ్డారని కొమెర శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మాచర్ల టౌన్‌ పోలీసులు తెలిపారు. పోలీసులు పిన్నెల్లిని మాచర్ల కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో తెదేపా నేతలు కొందరు పట్టణంలో బాణసంచా కాల్చి, సంబరాలు చేసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని