Pawan Kalyan: సూర్యారాధన చేసిన పవన్‌ కల్యాణ్‌

వారాహి ఏకాదశ దీక్షలో ఉన్న జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ గురువారం సూర్యారాధన క్రతువులో పాల్గొన్నారు.

Updated : 05 Jul 2024 16:57 IST

ఈనాడు, అమరావతి: వారాహి ఏకాదశ దీక్షలో ఉన్న జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ గురువారం సూర్యారాధన క్రతువులో పాల్గొన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈ ఆరాధనను నిర్వహించారు. నిత్యం సూర్య నమస్కారాలు ఆచరించే పవన్‌కల్యాణ్‌కు ఇటీవల వెన్ను సంబంధిత సమస్య తలెత్తడంతో వాటిని చేయలేదు. అందుకు ప్రతిగా ఈసారి మంత్రసహిత సూర్య ఆరాధనను నిర్వర్తించారు. సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆయన ఈ క్రతువును ఆచరించారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. సూర్యారాధన విశిష్టతను వేదపండితులు కోసిగంటి సుధీర్‌ శర్మ, హరనాథ శర్మ, వేణుగోపాలశర్మ పవన్‌కల్యాణ్‌కు వివరించారు.

హరిప్రసాద్‌ సేవలు విలువైనవి: పవన్‌కల్యాణ్‌

జనసేన పార్టీకి హరిప్రసాద్‌ అందించిన సేవలు విలువైనవి.. నిస్వార్థమైనవని పవన్‌కల్యాణ్‌ అన్నారు. మండలిలో ప్రజా సమస్యలు, రాష్ట్రాభివృద్ధిపై బలంగా చర్చించే అవగాహన ఆయనకు ఉందని పేర్కొన్నారు. హరిప్రసాద్‌ గురువారం పవన్‌ను కలిసి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని