Aravinda babu: అర్ధరాత్రి రోడ్డు ఊడ్చిన నరసరావుపేట ఎమ్మెల్యే

ఎవరూ చూడరు... ఎవరూ పట్టించుకోరని అధికారులు, ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే కుదరదని పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు అన్నారు.

Updated : 28 Jun 2024 07:16 IST

రోడ్డు ఊడుస్తున్న ఎమ్మెల్యే అరవిందబాబు తదితరులు

నరసరావుపేటసెంట్రల్, న్యూస్‌టుడే: ఎవరూ చూడరు... ఎవరూ పట్టించుకోరని అధికారులు, ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే కుదరదని పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు అన్నారు. బుధవారం అర్ధరాత్రి పట్టణ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఉన్న రోడ్డును ఆయన నాయకులు, పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి చీపురు పట్టి ఊడ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్రలో భాగంగా నరసరావుపేటను క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా ఉంచాలని నిర్దేశించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే సమాజం బాగుంటుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రవిచంద్రారెడ్డి, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని