Ysrcp: జగన్‌ రంగుల మాయకు రూ.కోట్ల ఖర్చు!

మీరేదైనా వాహనం కొంటే స్టిక్కరింగ్‌కు ఎంతవుతుంది? మహా అయితే రూ.2 వేల నుంచి రూ.5 వేలు. కానీ, వైకాపా ప్రభుత్వం వైఎస్సార్‌ సంచార పశువైద్య సేవా వాహనాలకు రంగులు, జగన్‌ బొమ్మలు వేయించడానికి రూ.2.50 కోట్లు ఖర్చుపెట్టినట్లు అంచనా.

Updated : 04 Jul 2024 08:40 IST

పశువైద్య సేవా వాహనాలకు స్టిక్కర్లు తొలగించాలన్నా రూ.3.40 కోట్లు కావాల్సిందే 

ఈనాడు, అమరావతి: మీరేదైనా వాహనం కొంటే స్టిక్కరింగ్‌కు ఎంతవుతుంది? మహా అయితే రూ.2 వేల నుంచి రూ.5 వేలు. కానీ, వైకాపా ప్రభుత్వం వైఎస్సార్‌ సంచార పశువైద్య సేవా వాహనాలకు రంగులు, జగన్‌ బొమ్మలు వేయించడానికి రూ.2.50 కోట్లు ఖర్చుపెట్టినట్లు అంచనా. వైకాపా వీరవిధేయ అధికారులు కనీస ఆలోచన లేకుండా కోట్లు ఖర్చు పెట్టి వాహనాలకు వైకాపా రంగులు, జగన్‌ స్టిక్కర్లు వేశారు. ఇప్పుడు వాటిని తొలగించి కొత్తగా స్టిక్కరింగ్‌ చేయాలంటే ఒక్కో వాహనానికి రూ.లక్షకు పైగా వెచ్చించాల్సి వస్తోంది. మొత్తం 340 వాహనాలకు స్టిక్కరింగ్‌ వేయించాలంటే రూ.3.40 కోట్లు పైనే కావాల్సి ఉంది. గత ప్రభుత్వానికి స్టిక్కర్లపై యావ తప్పితే.. మూగజీవాల సంక్షేమాన్ని ఎంతమాత్రమూ పట్టించుకోలేదు. పశుసంవర్థక శాఖ పరిధిలో రూ.562 కోట్ల బకాయిలు పెట్టింది. పశువుల మందులకూ డబ్బుల్లేవు. టీకాలకూ బకాయిలు పెట్టింది. 340 సంచార పశు వైద్యసేవా వాహనాలకు మాత్రం రూ.240.69 కోట్లు వెచ్చించింది. పెద్ద పెద్ద బొమ్మలు, పార్టీ రంగులేసుకున్న ఈ వాహనాల కొనుగోలుకూ ఇంకా రూ.28 కోట్ల బకాయి పెట్టింది. పైగా వాటి సేవలు అంతంత మాత్రమే. చాలాచోట్ల వైద్యులు, సిబ్బంది లేరు. లిప్ట్‌లు తుప్పుపట్టాయి. మందులు, పరీక్షలూ లేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని