Vijayawada: జేఈఈ 8వ ర్యాంకర్‌కు రూ.1.60 కోట్ల పురస్కారం

విజయవాడ ఫిట్జి కళాశాల విద్యార్థి కోడూరు తేజేశ్వర్‌ జేఈఈ అడ్వాన్స్‌ ఫలితాల్లో ఓపెన్‌ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకు సాధించినందుకు కళాశాల యాజమాన్యం రూ.1.60 కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది.

Updated : 30 Jun 2024 07:18 IST

తేజేశ్వర్‌కు చెక్కు అందజేస్తున్న ఐఏఎస్‌ అధికారి ప్రద్యుమ్న, ఫిట్జీ కళాశాల డైరెక్టర్‌ రమేష్‌బాబు 

విజయవాడ సిటీ (లబ్బీపేట), న్యూస్‌టుడే: విజయవాడ ఫిట్జి కళాశాల విద్యార్థి కోడూరు తేజేశ్వర్‌ జేఈఈ అడ్వాన్స్‌ ఫలితాల్లో ఓపెన్‌ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకు సాధించినందుకు కళాశాల యాజమాన్యం రూ.1.60 కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఏఎస్‌ అధికారి ప్రద్యుమ్న హాజరై చెక్కును తేజేశ్వర్‌కు అందించారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు సాయి కార్తీక్‌కు రూ.16 లక్షలు, పవన్‌ సాయి సుభాష్‌కు రూ.14 లక్షలు, పవన్‌ చంద్రకు రూ.5 లక్షలు, కామేశ్వరరావుకు రూ.5 లక్షలు, విశాల్‌రెడ్డికి రూ.2 లక్షలు, సత్యనారాయణ సాకేత్, విష్ణువర్ధన్‌రెడ్డి, సాయి లోకేష్, గణేష్‌లకు రూ.లక్ష చొప్పున నగదు పురస్కారాలు అందజేశారు. కళాశాల డైరెక్టర్‌ పిన్నెపు రమేష్‌బాబు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని