CM Chandra babu: అమరావతిలో పెట్టుబడులు పెట్టండి.. కర్ణాటక వ్యాపారవేత్తలకు చంద్రబాబు పిలుపు

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లోని పారిశ్రామికవేత్తలకు పలు సూచనలు చేశారు.

Updated : 27 Jun 2024 08:22 IST

చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందిస్తున్న చంద్రశేఖర్, వెంకటరమణ

ఈనాడు, బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లోని పారిశ్రామికవేత్తలకు పలు సూచనలు చేశారు. ఆయన బుధవారం చిత్తూరు నుంచి తిరుగు ప్రయాణంలో భాగంగా బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా సెంచురీ గ్రూప్‌ సంస్థల ఈడీ అశ్విని పై, ఎండీ రవీంద్ర పై తదితరులు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు వారికి సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా అమరావతిలో పెట్టుబడుల విషయంపై నిర్ణయం తీసుకుంటామని అశ్విని పై తెలిపారు. ఈ సందర్భంగానే చంద్రబాబును కర్ణాటక ఇంటర్నల్‌ సెక్యూరిటీ డివిజన్‌ ఏడీజీపీ మువ్వ చంద్రశేఖర్, కర్ణాటక తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెల్లం రమణ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని