జగన్‌ ఫొటోతో ఉన్న నవరత్నాల లోగోలు తొలగించరేం?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినా కొన్ని ప్రభుత్వశాఖల అధికారులకు గత వైకాపా ప్రభుత్వంపై అభిమానం తగ్గినట్లు లేదు. వైకాపా జెండా రంగులో రూపొందించిన కొన్ని ప్రభుత్వశాఖల వెబ్‌సైట్‌లను ఇప్పటికీ అదే విధంగా కొనసాగిస్తున్నారు.

Published : 05 Jul 2024 08:24 IST

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు మండలం జి.కొత్తూరు గ్రామ సచివాలయ భవనంపై జగన్‌ ఫొటోతో నవరత్నాల లోగో 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినా కొన్ని ప్రభుత్వశాఖల అధికారులకు గత వైకాపా ప్రభుత్వంపై అభిమానం తగ్గినట్లు లేదు. వైకాపా జెండా రంగులో రూపొందించిన కొన్ని ప్రభుత్వశాఖల వెబ్‌సైట్‌లను ఇప్పటికీ అదే విధంగా కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల్లోనూ జగన్‌ ఫొటోతో ఉన్న నవరత్నాల లోగోలను ఇప్పటికీ తొలగించలేదు. అందరికీ కనిపించేలా ప్రతి భవనంపైనా వీటిని ఏర్పాటు చేశారు. ఒక్కో లోగో కోసం రూ.30,000 వరకు ఖర్చు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ నిధులతో నిర్మించిన భవనాల్లో ముఖ్యమంత్రి ఫొటోతో ఉన్న లోగోల ఏర్పాటు నిబంధనలకు విరుద్ధం. ప్రధాని ఫొటో లేకుండా కేవలం జగన్‌ ఫొటోతో సీఎంవో అధికారులు అప్పట్లో లోగోను రూపొందించారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల ముందు వరకు పూర్తయిన దాదాపు 20 వేల భవనాల్లో లోగోల ఏర్పాటుకే రూ.60 కోట్ల వరకు ఖర్చు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినా వీటిని తొలగించే విషయంలో అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని