కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానించాలి

రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలతో కలిసి పనిచేయాలని నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులను మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు.

Published : 05 Jul 2024 04:38 IST

విదేశీ ఉద్యోగావకాశాలకు కేరళ విధానంపై అధ్యయనం
నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులకు మంత్రి లోకేశ్‌ ఆదేశం 

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలతో కలిసి పనిచేయాలని నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులను మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు. రాష్ట్రంలోని ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానించి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో లోకేశ్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ‘ప్రతి ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలను స్థానికంగా ఉన్న  కంపెనీలతో అనుసంధానించి, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేలా ప్రణాళికలు తయారు చేయాలి. ఇందులో భాగంగా అమరావతిలో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌) కేంద్రాన్ని, మంగళగిరిలో జెమ్స్, జ్యుయలరీ శిక్షణా సంస్థను నెలకొల్పేందుకు సర్వే నిర్వహించి, తగిన చర్యలు తీసుకోవాలి. ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు విభాగాల వారీగా ప్రణాళికలు రూపొందించాలి. ఇందుకు ప్రతి అధికారి చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఉపాధి కల్పనపై కేరళ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలి’ అని ఆయన ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని